ఏపీలో టాప్-9 రిచెస్ట్ ఎంపీ అభ్యర్థులు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్ సభ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రతి పార్టీకి చావో రేవో అనే పరిస్థితి నెలకొంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేశాయి. ఈ ఎన్నికల్లో రూ.100 కోట్లకు పైబడిన కోటీశ్వరులు అనేకమంది బరిలో ఉన్నారు. అన్ని పార్టీల నుంచి శత కోటీశ్వరులు రంగంలోకి దిగారు. ఏపీలోని చట్టసభలకు పోటీచేస్తున్న కోటీశ్వరుల వివరాలను, టాప్-10 రిచెస్ట్ అభ్యర్థుల వివరాలను తెలుసుకుందాం.
ఎవరికీ అందనంత ఎత్తులో తెలుగుదేశం పార్టీ నేత పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. ఈయన గుంటూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. అఫిడవిట్ లో రూ.5,785 కోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. ఆయన తర్వాత స్థానంలో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థే ఉన్నారు. నెల్లూరు నుంచి లోక్ సభకు పోటీపడుతున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూ.716.31 కోట్లతో రెండో స్థానంలో నిలిచారు. మూడోస్థానంలో కూడా కూటమి అభ్యర్థే నిలిచారు. అనకాపల్లి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సీఎం రమేష్ తనకు రూ.497.59 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు.

నాలుగో స్థానంలో హీరో నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ ఉన్నారు. విశాఖపట్నం లోక్ సభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆయన తనకు రూ.393.41 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ప్రమాణ పత్రంలో వెల్లడించారు. ఐదోస్థానంలో రాజంపేట లోక్ సభ నుంచి బరిలోకి దిగిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉన్నారు. ఆయనకు రూ.209.53 కోట్ల విలువైన ఆస్తులున్నాయి.
ఆరో స్థానంలో నంద్యాల వైసీపీ ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డి రూ.147.74 కోట్లతో, ఏడో స్థానంలో మచిలీపట్నం వైసీపీ ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ రూ.138.41 కోట్లతో, ఎనిమిదో స్థానంలో మచిలీపట్నం నుంచి జనసేన తరఫున పోటీచేస్తున్న ఎంపీ అభ్యర్థి బాలశౌరి రూ.133.71 కోట్లతో, తొమ్మిదో స్థానంలో కాంగ్రెస్ పార్టీ తరఫున కడప నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న వైఎస్ షర్మిల రూ.132 కోట్లతో












Click it and Unblock the Notifications