ఏపీలో ఘోర రైలు ప్రమాదం: రెండు రైళ్లు ఢీకొనడంతో ఆరుగురు మృతి, పలువురికి గాయాలు
విజయనగరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్నం నుంచి పలాస వెళ్తున్న ప్రత్యేక ప్యాసింజర్ రైలు కొత్త వలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద సిగ్నల్ లేకపోవడంతో పట్టాలపై ఆగివుంది. అదే సమయంలో దాని వెనకాలే వస్తున్న విశాఖపట్నం-రాయగడ రైలు.. ప్యాసింజర్ రైలును ఢీకొట్టింది. దీంతో అక్కడ భీతావాహ పరిస్థితి ఏర్పడింది. క్షతగాత్రుల రోదనలు మిన్నంటాయి.
కాగా, రైలు ప్రమాదంపై రైల్వే బోర్డు గ్రూపులో డీఆర్ఎం సౌరబ్ ప్రసాద్ సమాచారం ఇచ్చారు. పట్టాలు తప్పిన ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. సమాచారం అందడంతో ఇప్పటికే సహాయక బృందాలు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నాయి. గాయపడినవారిని ఆస్పత్రులకు తరలిస్తున్నాయని డీఆర్ఎం తెలిపారు.

ఈ ప్రమాదంలో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఆరుగురు ప్రయాణికులు మృతి చెందగా.. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రైళ్లు ఢీకొనడంతో ఘటనా స్థలంలో విద్యుత్ వైర్లు తెగిపోయాయి. దీంతో ఆ ప్రాంతమంతా అంధకారం నెలకొంది. ఇది సహాయక చర్యలకు కొంత ఆటంకం కలిగిస్తోంది. కాగా, సిగ్నలింగ్ లోపం కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
హెల్ప్ లైన్ నెంబర్లు:
రైలు ప్రమాదం నేపథ్యంలో అధికారులు హెల్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేశారు. సమాచారం కోసం.. 0891 2746330, 0891 2744619, 81060 53051, 81060 53052, 85000 41670, 85000 41677, 83003 83004, 85005 85006 నెంబర్లకు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు.
ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి
రైలు ప్రమాద ఘటనపై సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖపట్నం నుంచి రాయగడ వెళ్తన్న ప్యాసింజర్ రైలుకు ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం వచ్చిందని, ఈ ఘటనలో నాలుగు బోగీలు పట్టాలు తపపినట్లుగా సమాచారం అందుతోందని సీఎంఓ అధికారులు సీఎంకి వివరించారు. కాగా, వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.
విజయనగరం సమీప జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లినుంచి వీలైనన్ని అంబులెన్సులను పంపించాలని, మెరుగైన వైద్యం అందించడానికి సమీప ఆస్పత్రుల్లో అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications