బెజవాడ, మచిలీపట్నం, కాకినాడ ప్రజలకు ముఖ్య గమనిక
భద్రతాపరమైన ఆధునికీకరణ పనులు జరుగుతుండటంతో విజయవాడ డివిజన్‌లో వారం రోజులపాటు పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించి నడుపుతున్నారు. ఒడిసాలోని బాలసోర్ వద్ద కోరమాండల్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఎక్కడా ఇటువంటి పరిస్థితి తలెత్తకూడదనే ఉద్దేశంతో అన్ని జోన్లలో, డివిజన్లలో సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునికీకరిస్తున్నారు.
నవంబరు 6 నుంచి 12వ తేదీ వరకు
గుంటూరు - విశాఖ (17239) సింహాద్రి ఎక్స్‌ప్రెస్
రాజమండ్రి - విశాఖ (07466) మెమూ,
విశాఖ - రాజమండ్రి (07467) మెమూ

కాకినాడ పోర్టు - విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (17267),
విశాఖపట్నం - కాకినాడ పోర్టు ఎక్స్‌ప్రెస్ (17268),
విజయవాడ - విశాఖపట్నం రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12717,12718),
గుంటూరు - రాయగడ ఎక్స్‌ప్రెస్ (17243),
మచిలీపట్నం - విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (17219)
నవంబరు 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు
విశాఖ - గుంటూరు (రైలు నెం.17240) సింహాద్రి ఎక్స్‌ప్రెస్
నవంబర్ 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు
విశాఖపట్నం - మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ (17220),
రాయగడ - గుంటూరు ఎక్స్‌ప్రెస్ (17244) రైళ్ళను రద్దు చేశారు.
భద్రతా పరమైన పనులను ఆధునికీకరిస్తున్నామని, ప్రయాణికులకు తాత్కాలికంగా ఇబ్బందులు తలెత్తినప్పటికీ దీర్ఘకాలికంగా ఎంతో మేలు కలిగిస్తాయని, ప్రతి ఒక్కరూ రైల్వేకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications