విజయవాడ ప్రజలకు ఒక ముఖ్యమైన సూచన
విజయవాడ డివిజన్ పరిధిలో భారీగా రైళ్లు రద్దు అయ్యాయి. నిర్వహణకు సంబంధించిన పనులు జరుగుతుండటంతో వీటిని రద్దుచేసినట్లు అధికారులు వెల్లడించారు. ఒడిసాలోని బాలసోర్ వద్ద సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలవల్ల కోరమాండల్ ఎక్స్ ప్రెస్ భారీ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.
ఈ ప్రమాదంలో దాదాపు 300కు పైగా ప్రయాణికులు అశువులు బాశారు. రెండోసారి ఇటువంటి ప్రమాదం జరగకూడదనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా అన్ని డివిజన్ల పరిధిలోని సిగ్నలింగ్ వ్యవస్థను రైల్వే ఆధునికీకరిస్తోంది. ఇందులో భాగంగా విజయవాడ డివిజన్ పరిధిలో పనులు జరుగుతున్నాయి.

కాకినాడ-విశాఖపట్నం, విశాఖపట్నం-కాకినాడ పోర్టు, మచిలీపట్నం-విశాఖపట్నం, విశాఖపట్నం-మచిలీపట్నం,గుంటూరు-రాయగడ, రాయగడ-గుంటూరు, విజయవాడ-విశాఖపట్నం, విశాఖపట్నం-విజయవాడ,గుంటూరు-విశాఖపట్నం, విశాఖపట్నం-గుంటూరు, బిట్రగుంట-విజయవాడ, విజయవాడ-బిట్రగుంట,బిట్రగుంట-చెన్నై సెంట్రల్, చెన్నై సెంట్రల్-బిట్రగుంట, విజయవాడ-తెనాలి, తెనాలి-విజయవాడ,
విజయవాడ-ఒంగోలు, ఒంగోలు-విజయవాడ, విజయవాడ-గూడూరు, గూడూరు-విజయవాడ,
మచిలీపట్నం-విజయవాడ, విజయవాడ-మచిలీపట్నం, నర్సాపూర్-విజయవాడ,
విజయవాడ-మచిలీపట్నం, మచిలీపట్నం-విజయవాడ, విజయవాడ-భీమవరం, మచిలీపట్నం-విజయవాడ, విజయవాడ-నర్సాపూర్ రైళ్ళను
డిసెంబరు 17వ తేదీవరకు రద్దు చేశారు. ఇవి కాకుండా మరో 11 రైళ్లను తాత్కాలికంగా నిడదవోలు, తణుకు, భీమవరం, ఆకివీడు, గుడివాడ, విజయవాడల మీదుగా మళ్లించారు.












Click it and Unblock the Notifications