విశాఖ నుంచి ప్రధాన రైళ్ల రాకపోకల పై రైల్వే కీలక నిర్ణయం..!!
విశాఖ సమీపంలో ఎర్నాకులం ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైంది. విశాఖ జిల్లా దువ్వాడ మీదుగా ఎర్నాకుళం వెళ్లే టాటా-ఎర్నాకుళం(18189) ఎక్స్‌ప్రెస్ ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 గంటల సమయంలో అగ్నిప్రమాదానికి గురైంది. రైలులోని ప్యాంట్రీ కారును ఆనుకుని ఉన్న బీ1, ఎం2 ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పడానికి శ్రమించారు. కాగా, ఈ ప్రమాదం కారణంగా విజయవాడ వైపు వెళ్లే పలు రైళ్ల పై రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
టాటా-ఎర్నాకుళం(18189) ఎక్స్‌ప్రెస్ అగ్ని ప్రమాదానికి గురైంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పడానికి శ్రమించారు. రెండు బోగీల్లోని ప్రయాణికుల సామగ్రి మొత్తం కాలిపోయింది. అనంతరం ప్రమాదంపై రైల్వే ఉన్నతాధికారులు స్టేషన్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. హుటాహుటిన అంబులెన్స్‌లను ప్రమాద స్థలానికి రప్పించారు. చలిలో సుమారు 2,000 వేల మంది ప్రయాణికులు స్టేషన్‌లో పడిగాపులు పడ్డారు. ఈ నేపథ్యంలో విశాఖ-విజయవాడ మార్గంలో రైళ్లన్నీ నిలుపుదల చేశారు. అర్ధరాత్రి 3.30 గంటలు దాటిన తర్వాత రైల్వే అధికారులు కాలిపోయిన రెండు బోగీలను తొలగించి, ఆయా బోగీల్లోని ప్రయాణికులను మిగతా బోగీల్లో సర్దుబాటు చేసి రైలును పంపించడానికి ఏర్పాట్లు చేశారు. అయితే B1 బోగీలో ఒకరు సజీవ దహనమైనట్లు అధికారులు తెలిపారు. మృతుడిని విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్(70)గా గుర్తించారు. మరోవైపు రెండు బోగీల్లోని ప్రయాణికులను సామర్లకోట స్టేషన్‌కు 3 ఆర్టీసీ బస్సుల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

కాగా, విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులు ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాలు చూసుకోవాలని సూచించారు. రిజర్వేషన్ పాసింజర్ లు మాత్రమే ఎలమంచిలి రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణం చేయాలని ప్రకటించారు. 17479 (పూరి-TPTY), ట్రైన్ నెంబర్ 18045 (ఎస్‌హెచ్‌ఎం-CHZ) ట్రైన్ నెంబర్ 12805 (విశాఖపట్నం-LPI), ట్రైన్ నెంబర్ 17240 (విశాఖపట్నం-గుంటూరు) రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఉదయ్ ఎక్స్ ప్రెస్, విశాఖ- లింగంపల్లి జన్మభూమి, విశాఖ- గుంటూరు సింహాద్రి మూడు గంటలకు పైగా ఆలస్యమయ్యాయి. విశాఖ కు రావాల్సిన గోదావరి, హౌరా ఎక్స్ ప్రెస్ లు ఆలస్యంగా చేరుకుంటున్నాయి. ఆ మర్గంలో రైళ్ల రాకపోకల పైన సమాచారం అందించేందుకు రైల్వే అధికారులు ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేసారు.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications