ఇస్తేనే చేస్తాం: బాబుకు ఝలక్, చేతులెత్తేసిన ట్రాన్స్‌ట్రాయ్, సీఎం ఆగ్రహం

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు సంస్థలు ఆర్థిక గొడవల్లో చిక్కుకున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాము చేసిన పనులకు డబ్బులు ఇవ్వలేదని చెబుతూ సబ్ కాంట్రక్టర్లు పనులు నిలిపివేసినట్లుగా చెబుతున్నారు.

బిల్డింగ్‌లపై ప్రభావం: అమరావతికి ప్రకంపనల ముప్పు, ఆ భూకంపం దెబ్బకు

 చేతులెత్తేసిన ట్రాన్స్ ట్రాయ్

చేతులెత్తేసిన ట్రాన్స్ ట్రాయ్

దీంతో తమ ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉందని ప్రధాన కాంట్రాక్ట్ సంస్థ ట్రాన్స్‌ట్రాయ్ చేతులెత్తేసిందని అంటున్నారు. ఈ కారణంగా నాలుగైదు రోజులుగా పోలవరం పనులు ముందుకు కదల్లేదు. ఎల్ అండ్ టి, బావర్ సంస్థలు కాపర్ డ్యాంకు సంబంధించిన పనులు చేస్తుండగా మిగిలిన సబ్ కాంట్రాక్టర్లు చేతులెత్తేశారని తెలుస్తోంది.

 ట్రాన్స్ ట్రాయ్ సమాధానంతో షాక్

ట్రాన్స్ ట్రాయ్ సమాధానంతో షాక్

తమకు కాంట్రాక్ట్ సంస్థ ట్రాన్స్‌ట్రాయ్ చెల్లింపులు చేయడం లేదని త్రివేణితో సహా ఇతర సబ్ కాంట్రాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పనులు నిలిపేశారు. దీంతో జలవనరుల శాఖ రంగంలోకి దిగి ట్రాన్స్‌ట్రాయ్‌తో చర్చించింది. సబ్ కాంట్రాక్టు సంస్థలకు చెల్లింపులు చేయాలని చెప్పింది. అయితే ట్రాన్స్ ట్రాయ్ నుంచి జలవనరుల శాఖకు ఊహించని సమాధానం వచ్చింది.

 ఆర్థిక నష్టాల్లో ఉన్నామని చెప్పడంతో అధికారుల ఆశ్చర్యం

ఆర్థిక నష్టాల్లో ఉన్నామని చెప్పడంతో అధికారుల ఆశ్చర్యం

ఘాటు సమాధానాలు, రామ్ గోపాల్ వర్మ ఎఫెక్ట్: రోజాను లాగారు, జగన్‌కు హెచ్చరిక మేమే చాలా ఆర్థిక కష్టాల్లో ఉన్నామని, ప్రభుత్వం ముందస్తుగా నిధులు మంజూరు చేస్తే సబ్‌ కాంట్రాక్టర్లకు చెల్లిస్తామని, తమకు ఇచ్చిన డబ్బును భవిష్యత్తులో పూర్తయ్యే పనుల బిల్లుల నుంచి రీయింబర్స్‌ చేసుకోవాలని ట్రాన్‌స్ట్రాయ్‌ లేఖ రాసిందట. తాను చేయించుకున్న పనులకు సొమ్ములు చెల్లించకపోగా ఆ డబ్బును ప్రభుత్వం చెల్లించాలని కోరడంపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారట. అంతేకాదు, ఆర్థికంగా కష్టాల్లో ఉన్నందున డబ్బులు ముందస్తుగా ఇవ్వకుంటే కాంట్రాక్ట్ బాధ్యతల నుంచి తొలగుతామని కూడా చెప్పిందట.

 చంద్రబాబు ఆగ్రహం

చంద్రబాబు ఆగ్రహం

పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ పనులపై ట్రాన్స్ ట్రాయ్ చేతులెత్తేయడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. పనులు చేపట్టని ప్రధాన కాంట్రాక్టు సంస్థను తక్షణమే తప్పించి ఈ-టెండరు ద్వారా కొత్త సంస్థను ఖరారు చేయాలని ఆదేశించారు. జాతీయ ప్రాజెక్టు అయినందున కీలక నిర్ణయాలన్నీ కేంద్ర పరిధిలోనే జరుగుతాయని అధికారులు వివరించారు. కాగా, 2018లో పూర్తి చేయాలనుకుంటున్న చంద్రబాబుకు ట్రాన్స్‌ట్రాయ్ హఠాత్తుగా చేయిచ్చింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Transtroy gave shock on Polavaram Project. Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu unhappy with Transtroy.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి