ఇదేం కొత్త ట్రెండ్, రాజకీయాల కోసమా: కేంద్రంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Recommended Video

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ కార్యాలయాన్ని కేంద్రంలోని అధికార పార్టీ రాజకీయ అవసరాలకు వాడుకుంటోందని సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రం తీరు రాజ్యాంగ విరుద్ధంగా ఉందన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించడం సరికాదని విమర్శించారు.
కేంద్రం తీరుపై ఆయన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లోను ట్వీట్ చేశారు. కేంద్రంలోని అధికార పార్టీ కొత్త సంస్కృతిసకి తెరలేపిందని చంద్రబాబు అన్నారు. గవర్నర్ కార్యాలయాన్ని రాజకీయ అవసరాలకు వాడుకుంటోందన్నారు. ఇలా వాడుకోవడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు.

చంద్రబాబు ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతు పలికిన విషయం తెలిసిందే. దీనిపై కూడా ట్వీట్ చేశారు. అంతకుముందు, ఆ తర్వాత ట్వీట్లు తెలుగులో చేసిన చంద్రబాబు కేంద్రంపై విమర్శలకు సంబంధించిన ట్వీట్లు మాత్రం ఇంగ్లీష్‌లో చేశారు. తద్వారా కేంద్రాన్ని టార్గెట్ చేశారు.












Click it and Unblock the Notifications