ట్విస్ట్: ట్రిపుల్ మర్డర్ కేసు నిందితుడు రామసుబ్బారెడ్డి ఆత్మహత్య
భార్య, ఇద్దరు కుమార్తెలను దారుణంగా హతమార్చిన ఘటనలో కీలక నిందితుడు రామసుబ్బారెడ్డి పురుగుల మందుతాగి బుదవారం నాడు ఆత్మహత్య చేసుకనొ్నాడు.
అనంతపురం: భార్య, ఇద్దరు కుమార్తెలను దారుణంగా హతమార్చిన ఘటనలో కీలక నిందితుడు రామసుబ్బారెడ్డి పురుగుల మందుతాగి బుదవారం నాడు ఆత్మహత్య చేసుకనొ్నాడు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోవడంతో విషాదం నెలకొంది.
అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన రామసుబ్బారెడ్డి మంగళవారం రాత్రి తన కుటుంబసభ్యులను ముగ్గురిని హతమార్చి పారిపోయారు. భార్య సులోచనమ్మ, కూతుళ్ళ ప్రత్యూష,సాయి ప్రతిభలను హత్య చేశాడు.

వీరిని హత్య చేసిన తర్వాత అతను పారిపోయాడు. అతడికోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఓ వైపు భార్య, పిల్లలను అతికిరాతకంగా సుత్తితో హతమార్చిన రామసుబ్బారెడ్డి భయంతో ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
బుదవారం ఉదయం టిటిడి కళ్యాణ మండపం వద్ద అపస్మారకస్థితిలో ఉన్న రామసుబ్బారె్డ్డిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే రామసుబ్బారెడ్డి తన కుటుంబసభ్యులను హత్య చేసే సమయంలో ఇంట్లో లేని మరో కూతురు ప్రత్యూష ప్రాణాలతో బయటపడింది. సులోచన, రామసుబ్బారెడ్డి తరచూ గొడవపడుతూండేవారని ఈ కారణంగానే రామసుబ్బారెడ్డి వారిని హత్య చేసి ఉంటారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications