పులిచింతలపై సందేహాలు ?- ఇరుకున పడ్డ జగన్-ముందునుయ్యి వెనుక గొయ్యి
ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో గుంటూరు జిల్లాలో ఉన్న పులిచింతల ప్రాజెక్టు 16వ నంబర్ గేటు కొట్టుకుపోయిన ఘటన కృష్ణా, గుంటుూరు జిల్లాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రాజెక్ట్ నాణ్యతపైనే సందేహాలు కలిగేలా చేస్తోంది. గతంలో ప్రాజెక్టు నిర్మించాక పూర్తిగా డబ్బులు చెల్లించలేదని ప్రభుత్వాన్ని కోర్టుకు ఈడ్చి మరీ రూ.400 కోట్లు వసూలు చేసుకున్న కాంట్రాక్టర్ పై వైసీపీ సర్కార్ ఇప్పుడు ఏం చర్యలు తీసుకోబోతోంది ? ఎప్పుడో ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేసిన ఈ ప్రాజెక్టు నిర్వహణలో విఫలమైన జలవనరులశాఖ అధికారులపై ఏం చర్యలు తీసుకోనుందన్న అంశం ఉత్కంఠ రేపుతోంది. అదే సమయంలో గేటు కొట్టుకుపోయిన ఘటనతో విజయవాడలోని కృష్ణా పరివాహ ప్రాంతాలకు ముప్పు పెరుగుతోంది.

పులిచింతల గేటు ఘటన
ఏపీ ఉమ్మడి రాష్ట్రంలో గుంటుూరు, నల్లొండ జిల్లాల సరిహద్దుల్లో నిర్మించిన పులిచింతల ప్రాజెక్టుకు చెందిన గేటు నంబర్ 16 తాజాగా వచ్చిన వరదలకు కొట్టుకుపోయింది. వరద ప్రవాహాన్ని నియంత్రించేందుకు మొన్న తెల్లవారు జాము గేటు తెరిచిన సమయంలో ఒక్కసారిగా వచ్చిన వరదకు ఇది కాస్తా విరిగిపోయి కొట్టుకుపోయింది. దీంతో ఈ గేటు ద్వారా వందలాది క్యూసెక్కుల నీరు ఇప్పుడు వృథాగా పోతోంది. దీన్ని నియంత్రించేందుకుప ప్రభుత్వం చర్యలు చేపట్టినా అవి ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో పులిచింతల ప్రాజెక్టు నుంచి భారీ ఎత్తున నీరు వృథా అయిపోతోంది. దీనికి ఎప్పుడు అడ్డుకట్ట పడుతుందో తెలియని పరిస్దితి ప్రభుత్వం వద్ద ఉంది.

వైఎస్సార్ మానసపుత్రిక
మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఢంలో భాగంగా 2004-05లో ఈ ప్రాజెక్టుకు బీజాలు వేశారు. అయితే నిధుల కొరత, భూసేకరణ వంటి సమస్యల కారణంగా దీని నిర్మాణం ఆలస్యంగా ప్రారంభమైంది. కృష్ణా, గుంటూరు జిల్లాల తాగు, సాగునీటి అవసరాలు, విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా 2010లో పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించారు. మూడేళ్లలోనే నిర్మాణం పూర్తయినా ... పూర్తిస్దాయిలో నీటి నిల్వ చేసేందుకు మాత్రం 2018 నాటికి అందుబాటులోకి వచ్చింది. ఇరు జిల్లాల్లోని 13 లక్షల ఎకరాలకు దీని ద్వారా సాగునీరు అందుతోంది. మొత్తం 46 టీఎంసీల నీటిని ఈ ప్రాజెక్టులో నిల్వ చేసే వీలుంది. ఈ ప్రాజెక్టుకు మొత్తం 24 గేట్లు ఉన్నాయి. ఇందులో తాజాగా విరిగిన గేటు నంబర్ 16.

వివాదాల పులిచింతల
పులిచింతల ప్రాజెక్టు నిర్మాణానికి రూ.1850 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణం దగ్గరి నుంచీ అన్నీ వివాదాలే. 2013లో పులిచింతల ప్రాజెక్టును అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. అయితే ఆ తర్వాత 2014లో రాష్ట్ర విభజన జరగడం, ఈ ప్రాజెక్టులో భారీగా నీటి నిల్వ చేస్తే తెలంగాణలోని నల్గొండ జిల్లాలో కొన్ని గ్రామాలు మునుగుతాయన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే ఏపీలో అప్పటి టీడీపీ ప్రభుత్వం మాత్రం 45 టీఎంసీల నీటి నిల్వకే ప్రాధాన్యమిచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత ఈ వివాదం సద్దుమణిగింది. మరోవైపు డ్యామ్ కాంట్రాక్టర్ కు అప్పటి టీడీపీ సర్కార్ పూర్తి డబ్బులు చెల్లించకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు రూ.400 కోట్లు పరిహారంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీని నాణ్యతపైనా ముందునుంచీ సందేహాలే వ్యక్తమయ్యాయి.

నాణ్యతపై అనుమానాలు
పులిచింతల ప్రాజెక్టు పూర్తయిన తర్వాత దీనికి కేఎల్ రావు సాగర్ గా పేరు పెట్టారు. అయితే ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా చోటు చేసుకున్న పలు సమస్యల కారణంగా దీని భద్రత, నాణ్యతపై సందేహాలు వ్యక్తమయ్యాయి. మీడియాలోనూ పలు వార్తలు వచ్చాయి. అయినా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. తనకు రావాల్సిన మొత్తం తీసుకున్నాక కాంట్రాక్టర్ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టు అప్పగించేసినట్లు లేఖ పంపారు. ఆ తర్వాత జల వనరులశాఖ చేతుల్లోకి వచ్చేసినా ఇప్పటివరకూ ప్రాజెక్టు నాణ్యతను పట్టించుకోలేదు. ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యంగానే వ్యవహరించాయి. దీంతో ఇప్పుడు గేటు కొట్టుకుపోయే పరిస్ధితి దాపురించింది. ఈ గేటు ఉదంతం తర్వాత మిగతా గేట్ల నాణ్యతపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

విజయవాడకు జల గండం
పులిచింతల ప్రాజెక్టు గేటు విరిగిపడిన ఘటన నేపథ్యంలో దాని దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజ్ కు భారీగా నీరు వచ్చి చేరుతోంది. అలాగని ప్రకాశం బ్యారేజ్ నుంచి అదే స్దాయిలో నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం లేదు. దీంతో విజయవాడలోని కృష్ణా నదీ పరివాహక ప్రాంతాలకు వరద ముప్పు పెరుగుతోంది. పులిచింతల గేటు విరిగిపడిన ఘటన తర్వాత అధికారులు కృష్ణా జిల్లా పరివాహక ప్రాంతాల్లో ఉంటున్న వారితో పాటు పులిచింతల దిగువన ఉంటున్న వారిని సైతం అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఏదైనా తాత్కాలిక ఏర్పాటు చేసి నీటిని నిలువరించినా భవిష్యత్తులో పులిచింతల మిగతా గేట్లు విరిగి పడవన్న గ్యారంటీ అయితే లేదు. దీంతో విజయవాడకు శాశ్వతంగా జలగండం పొంచి ఉందన్న ప్రచారం జరుగుతోంది.

ముందునుయ్యి వెనుక గొయ్యి
అంతర్ రాష్ట్ర సరిహద్దు కలిగిన పులిచింతల ప్రాజెక్టు గేటు ఊడిపడిన నేపథ్యంలో ఇప్పుడు జగన్ సర్కార్ తీసుకోబోయే నిర్ణయాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముఖ్యంగా తన తండ్రి వైఎస్సార్ హయంలో జలయజ్ఞం ద్వారా నిర్మించి ఈ ప్రాజెక్టు భద్రతపై సందేహాలు వ్యక్తం చేస్తే అది అంతిమంగా జగన్ కే రాజకీయంగా నష్టం కలిగిస్తుంది. అలాగని ఉపేక్షిస్తే విపక్షాల నుంచి విమర్శలు తప్పవు. అదే సమయంలో విజయవాడలో కృష్ణానదీ పరివాహక ప్రాంతాలు మునిగితే ప్రభుత్వం ఇరుకున పడటం ఖాయం. దీంతో ఈ వ్యవహారంపై జగన్ సర్కార్ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ ఆధునిక కాలంలో ఓ ప్రాజెక్టు గేటు కొట్టుకుపోవడం అంటే ఆషామాషీ విషయమేం కాదు. కానీ ప్రభుత్వం ప్రస్తుతానికి నిపుణుల కమిటీతోనే విచారణ చేయిస్తోంది. భవిష్యత్తులో దీనిపై పూర్తిస్దాయిలో సమగ్ర విచారణ జరిపితే కానీ నిజనిజాలు వెలుగులోకి రావు. దీంతో ప్రభుత్వం తీసుకోబోయే చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications