విజయవాడలో ఏపీ ఆందోళనలో పాల్గొన్న టీఆర్ఎస్ కార్యకర్త
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కేంద్రం తీరును నిరసిస్తూ ఏపీలో వామపక్షాలు గురువారం బంద్ తలపెట్టాయి. ఈ బందుకు వైసీపీ, జనసేన మద్దతు తెలిపింది. టీడీపీ పరోక్షంగా మద్దతు పలికింది.
వామపక్షాల ఆధ్వర్యంలో విజయవాడలోని లెనిన్ సెంటర్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యకర్త ఆదినారాయణ పాల్గొన్నారు. ఈ బంద్‌కు తన మద్దతు తెలిపారు.

ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ తలపెట్టిన ఈ పోరాటానికి తెలంగాణ ఎంపీలు కూడా మద్దతు తెలపాలని కోరతానని అన్నారు.












Click it and Unblock the Notifications