అమరులకి అన్యాయం: తెరాసపై షబ్బీర్, వారిపై చర్యలేవి: రేవంత్
హైదరాబాద్: బడ్జెట్‌లో అమరవీరులకు అన్యాయం జరిగిందని తెలంగాణ శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ సభ్యుడు షబ్బీర్ అలీ సోమవారం మండిపడ్డారు. బడ్జెట్లో రైతులకు కూడా న్యాయం జరగలేదన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను విస్మరించారని ఆరోపించారు.
ఇప్పటి వరకు ఏడు వందల మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో ఏ పవర్ ప్రాజెక్టు ఐదారేళ్ల కంటే ముందు పూర్తి కాలేదన్నారు. పవర్ కోసం అవసరాలకు తగినట్లుగా నిధులు కేటాయించలేదని ధ్వజమెత్తారు. వాటర్ గ్రిడ్ పైన కూడా ప్రశ్నలు కురిపించారు.

ఫిరాయింపులకు పాల్పడిన వారిపై చర్యలేవి: రేవంత్ రెడ్డి
పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారి పైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విలేకరుల సమావవేశంలో తెరాస ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెరాస ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నా చర్యలు తీసుకోవడం లేదన్నారు.
సభాపతి, మండలి చైర్మన్‌కు నోటీసులు ఇచ్చినా చర్యల్లేవన్నారు. గవర్నర్‌కు ఫిర్యాదు చేసినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్నారు. అంతకుముందు టీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర రెడ్డి నివాసంలో భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications