తెలంగాణ: ల్యాంకో హిల్స్‌పై ఆచితూచి, తేలిక కాదని..!
హైదరాబాద్: ల్యాంకో హిల్స్‌పై ఆచితూచి అడుగేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దూకుడుగా ముందుకెళితే న్యాయపరమైన సమస్యలు వస్తాయని భావిస్తోందట. దీనిపై అభిప్రాయం కోసం అడ్వొకేట్ జనరల్ కె రామకృష్ణారెడ్డికి లేఖ రాసింది. శనివారం సచివాలయంలో ల్యాంకో హిల్స్‌పై ఉన్నతాధికారుల బృందం చర్చలు జరిపింది.
ఏపీఐఐసీ ద్వారా ల్యాంకో హిల్స్ వేలంలో భూములు కొన్నందున ఈ భూములను ప్రభుత్వ భూములుగా పరిగణించాలా? లేక వక్ఫ్ భూములుగా చూడాలా? అనే అంశంపై తర్జనభర్జనలు పడుతున్నారు. ల్యాంకో హిల్స్ భూముల స్వాధీనం అంత తేలిక కాదని అధికార యంత్రాంగం ప్రభుత్వానికి చెబుతున్నట్లుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి.

కాగా, హైదరాబాద్ నగరంలోని అక్రమ నిర్మాణాలపై దృష్టిపెట్టిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ల్యాంకో హిల్స్‌పై పడినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. గురుకుల్ ట్రస్టు భూముల్లోని అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. ల్యాంకో హిల్స్‌పై దృష్టి పెట్టిన ప్రభుత్వం... అందుకు సంబంధించిన సమగ్ర వివరాలను అందజేయాల్సిందిగా రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించింది.
మణికొండలోని ల్యాంకోహిల్స్ భూముల వివరాలను సేకరించి నివేదిక పంపాలని ఆదేశించడంతో గురువారంనాడు రాజేంద్రనగర్ మండల తహశీల్దార్ (డిప్యూటీ కలెక్టర్) కె. చంద్రశేఖర్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రవీందర్ దత్తు, విఆర్వో చంద్రారెడ్డి ల్యాంకోహిల్స్‌ను సందర్శించారు. పూర్తి సమాచారంతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని తహశీల్దార్ చంద్రశేఖర్ తెలిపారు.












Click it and Unblock the Notifications