ట్యాపింగ్‌పై కేసు?: బాబు ఆడియోపై పరకాల లాజిక్

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం కేసు నమోదు చేసినట్లు ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న ఒక వ్యక్తి తెలిపినట్లుగా వార్తలు వస్తున్నాయి. తమ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ఉన్నతాధికారులు ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారే అనుమానాలు రావడంతో రెండు రోజుల క్రితమే ఏపీ ప్రభుత్వం కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

ఈ కేసులో త్వరలోనే నోటీసులు కూడా ఇస్తున్నారని చెబుతున్నారు. అయితే, దీనిపై అధికారికంగా ధృవీకరించవలసి ఉంది.

ఓటుకు నోటు వ్యవహారంపై ఏపీ నిఘా అధికారులు కూడా దృష్టి సారించారు. తమ అదుపులో ఉన్న ముగ్గురు నిందితులు చెప్పే అంశాలు, దర్యాఫ్తులో వెల్లడయ్యే విషయాల ఆధారంగా ఇంకా మరికొందర్ని ఈ కేసులో చేర్చవచ్చన్న అనుమానాల నేపథ్యంలో ఏపీ నిఘా అధికారులు అప్రమత్తమయ్యారు.

నిందితుల విచారణ జరుగుతున్న ఏసీబీ కార్యాలయానికి ఆదివారం అనేకమంది నిఘా విభాగానికి చెందిన అధికారులు వచ్చారు. లోపల ఏం జరుగుతుందే తెలుసుకునే ప్రయత్నం చేశారు. అదనపు ఎస్పీ స్థాయి అదికారుల నుంచి కానిస్టేబుల్ స్థాయి వరకు పదిమంది.. విచారణకు సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.

చంద్రబాబు ఆడియో సంభాషణల పైన పరకాల లాజిక్

TRS Government uses technology and created Chandrababu Naidu's phone call : Parakala Prabhakar

చంద్రబాబు ఆడియో సంభాషణలుగా భావిస్తున్న రికార్డింగుల పైన పరకాల ప్రభాకర్ పలు ప్రశ్నలు వేశారు. అధి చంద్రబాబు గొంతు కాదని, అది అతుకుల బొంత అన్నారు.

అదే సమయంలో అవే నిజమైతే.. దీనిపై ఇప్పటికే కోర్టు పరిధిలో ఉందని, అలాంటప్పుడు ఆ రికార్డింగులు కోర్టు పరిధిలో ఉండాలని, కోర్టుకు సమర్పించినప్పుడు బయటకు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. అవి నిజమైనవే అయితే ఇప్పటికే కోర్టులో ఉండాల్సింది అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+