ఏపీ ముఖ్యమంత్రి నిజాయితిగా మాట్లాడుతున్నారు : జేసీ దివాకర్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి జగన్ నిజాయితిగా మాట్లాడుతున్నారని మాజీ ఎంపీ , టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఏపికి ప్రత్యేక హోదా విషయంలో మోడీకి అంత పెద్ద మెజారీటీ రావడం దురదృష్టకరంమని పేర్కోనడం తోపాటు మోడీతో నేరుగా పోరాడే పరిస్థితి లేదని ఓప్పుకోవడం వెనుక జగన్ వాస్తవాలకు అనుగుణంగా మాట్లాడుతున్నాడని అన్నాడు.
ఈనేపథ్యంలోనే తాను రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు ఆయన ప్రకటించారు. ఇకపై రాజకీయాలు చేయబోనని చెప్పారు. ఈనేపథ్యంలోనే పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను ఆయన కొట్టి పారేశారు. తాను ఏ పార్టీలోను చేరడం లేదని స్పష్టం చేశారు.

ఇక జగన్ మంచి మెజారీటీ సాధించాడని ఆయనకు నేను సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. కాగా జగన్‌ను ఏనాడు వ్వక్తిగతంగా ద్వేషించలేదని అన్నారు. మరోవైపు జగన్ నూతన ముఖ్యమంత్రిగా మంచి పరిపాలనను అందిస్తాడని అశిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఇక ఇన్ని రోజులు తనకు సహకరించినందుకు అనంతపురం జిల్లా ఎస్సీని కలిసి కృతజ్ఝతలు చెప్పడానికి ఆయన కార్యాలయానికి వచ్చినట్టు ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications