హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

TRS Vs BJP: రెండువైపులా కాల్పుల విరమణ ఒప్పందం?

|
Google Oneindia TeluguNews

మదగజాల్లా హోరాహోరీగా ఢీకొట్టుకుంటున్న తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతాపార్టీ ప్రస్తుతానికి మౌనం వహించాయి. ఈ నిశ్శబ్దాన్ని యుద్ధంలో రెండువైపులా కాల్పుల విరమణ ఒప్పందంతో రాజకీయ విశ్లేషకులు పోలుస్తున్నారు. భారతీయ జనతాపార్టీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ను ఎట్టి పరిస్థితుల్లోను విచారణకు రప్పించాలనుకున్న సిట్ కోర్టు స్టే ఇవ్వడంతో మౌనం వహించింది.

మా జోలికి రావొద్దు.. మీ జోలికి మేం రాం

మా జోలికి రావొద్దు.. మీ జోలికి మేం రాం


ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి సీబీఐ, ఈడీ ఛార్జిషీట్లలో గులాబీ పార్టీకి అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులేమీ కనిపించడంలేదు. వాతావరణం కాస్తంత తేలికపడిందని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు... తమ జోలికి ఎవరూ రావొద్దని, మేం మీ జోలికి రామని. పలు బహిరంగసభల్లోను ఆయన పదే పదే ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అయినప్పటికీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాలు జరుపుతూ ముగ్గురు దొరికిపోయారు.
దీంతో టీఆర్ఎస్ కు పదునైనా అస్త్రం దొరికినట్లైంది.

ఇరుపార్టీలకు నష్టమే!

ఇరుపార్టీలకు నష్టమే!


భారతీయ జనతాపార్టీ ఆత్మరక్షణ ధోరణిలో పడింది. రోజురోజుకూ ముందుకు వెళ్లడంవల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని రెండు పార్టీలు భావించాయి. దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకొని ఇలా ప్రతీకార రాజకీయాలు చేసుకుంటే ఇరు పార్టీలకు నష్టమేనని ఇరువైపులా అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో పట్టుబడిన ముగ్గురిలో రామచంద్రభారతి అత్యంత కీలకమని తెలుస్తోంది. ఆయన దగ్గర నుంచి సేకరించిన సమాచారంవల్లే బీజేపీ పెద్దల గుట్టు తెలిసిందని సిట్ బయటకు లీకులిచ్చింది.

సిట్ విచారణకు హాజరైన నందకుమార్ సతీమణి

సిట్ విచారణకు హాజరైన నందకుమార్ సతీమణి


కేంద్ర మంత్రికి చెందిన కార్యదర్శి ఆడియోలు ఉన్నాయని, దీంతో ఆయనకు కూడా నోటీసులిస్తారంటూ ప్రచారం సాగింది. కాకపోతే ఇప్పుడు రెండువైపులా కాల్పుల విరమణలా కాస్తంత చల్లబడినట్లు కనిపిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ కేసుల విచారణ ప్రముఖులజోలికి వెళ్లే అవకాశం లేదని భావిస్తున్నారు. ప్రధాన నిందితుల్లో ఒకరైన నందకుమార్ సతీమణి చిత్రలేఖ మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. నందకుమార్ తన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి భార్యతో విస్త్రతంగా చర్చిస్తారని, వాట్సాప్ సంభాషణలు కూడా జరిగినట్లు గుర్తించారు. వీటిపై శుక్రవారం చిత్రలేఖను సుదీర్ఘంగా విచారించినప్పటికీ కొన్ని అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు ఈరోజు కూడా పిలిచారు.

English summary
The Telangana Rashtra Samithi and the Bharatiya Janata Party, which are clashing with each other, have remained silent for now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X