సురేఖకే న్యాయం చేయలేదు, టీకా..: జగన్‌పై కెటిఆర్

KT Rama Rao
హైదరాబాద్‌‌: తెలంగాణ జలాలకు సంబంధించి దోపిడీ జరిగిన వి షయాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీఅధక్షుడు వైఎస్‌ జన్మోహన్‌రెడ్డి అంగీకరించారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు కెటి రామారావు వ్యాఖ్యానించారు. జలాల దోపిడీ విషయాన్ని మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఒప్పకుంటే నేడు జగన్ అంగీకరించారన్నారు. నదీ జలాల విషయంలో అవగాహన పెంచుకోవాలని ఆయన జగన్‌కు సూచించారు.

భారత్, పాకిస్థాన్‌ రెండు దేశాలైనా ఆ దేశాలు ఐదు నదీ జలాల నీటిని పంచుకోవడం లేదా అని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో తెలంగాణకు వ్యతిరేకంగా ప్లకార్డు పట్టినరోజే తెలంగాణ అన్న పదం ఉచ్చరించే నైతిక హక్కును జగన్‌ కోల్పోయాడని కెటిఆర్ అన్నారు.

జగన్‌ను నమ్ముకొని మంత్రి పదవిని, ఎమ్మెల్సీ పదవిని వదులుకున్న కాంగ్రెస్‌ నుంచి వైయస్సార్ కాంగ్రెసులోకి వచ్చిన కొండా సురేఖ దంపతులకే ఎలాంటి న్యాయం చేయలేని జగన్‌ తెలంగాణకు ఎలాంటి న్యాయం చేయలేని జగన్‌ తెలం గాణ ఏ మేరకే న్యాయం చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణ ఎవరూ కూడా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ వీసా మాటలు, షర్మిల హైదరాబాద్‌, పాకిస్థాన్‌ పోలికను ఎవరు మర్చిపోలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

కిరణ్ కుమార్ రెడ్డి లాగే జగన్..

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర పేరుతో ఎలా మాట్లాడుతున్నారో ఇప్పుడు వైయస్ జగన్ అలా మాట్లాడుతున్నారని తెరాస శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. జగన్ నిజాయితీతో కూడిన, నీతిమంతమైన రాజకీయాలు చేయాలంటూ మాట్లాడడం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఆయన అన్నారు.

జగన్ పరిభాషలో నీతి అంటే అవినీతి కావచ్చునని, సక్రమం అంటే అక్రమాలు కావచ్చునని ఆయన అన్నారు. భూములు ఆక్రమించుకోవడం, కబ్జాలు చేయడం, ప్రజాధనాన్ని దోచుకోవడమే జగన్ లక్ష్యమని ఆయన అన్నారు. రాష్ట్రం విడిపోతే నీటి యుద్ధాలు వస్తాయని, సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయని మాట్లాడడం పచ్చి అబద్ధమని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+