ఎన్టీఆర్ విగ్రహానికి తెరాస అభ్యంతరం, ఉద్రిక్తత
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహం ఏర్పాటును తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సంఘటన బుధవారం మియాపూర్‌లో జరిగింది.
ఎన్టీఆర్ 91 జయంతి సందర్భంగా హైదరాబాదులోని మియాపూర్ ఆల్విన్ చౌరస్తాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థాపించడానికి ప్రయత్నించారు. అయితే, ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి వీలు లేదంటూ తెరాస అడ్డు తగిలింది. దీంతో ఇరు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

తెరాస కార్యకర్తల వ్యతిరేకతను తెలుగుదేశం పార్టీ నాయకులు ఖండించారు. అయితే, అనుమతి లేకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేయవద్దని హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వారిపై కూడా టిడిపి కార్యకర్తలు మండిపడుతున్నారు.
స్వర్గీయ ఎన్టీ రామారావు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. తెలుగు సినిమాల్లో తిరుగులేని కథానాయకుడిగా వెలిగారు.












Click it and Unblock the Notifications