బండారం బయటపెడ్తాం: రేవంత్ రెడ్డిపై తెరాస ఫైర్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై విరుచుకుపడిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డిపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. సీమాంధ్రలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసమే కెసిఆర్‌పై ఆరోపణలు చేస్తున్నారని తెరాస నాయకులు బాలరాజు, ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు అందరికీ తెలుసునని వారన్నారు.
కెసిఆర్ ఏదైనా పేరును మార్చాలనుకుంటే ముదుగా కెటిఆర్ పేరు మార్చాలనే వ్యాఖ్యను రేవంత్ రెడ్డి విజ్జతకే వదిలేస్తున్నామని తెరాస ఎమ్మెల్యే బాలరాజు అన్నారు. కెటిఆర్ పేరుకు ఎన్టీఆర్ పేరుకు సంబంధం లేదని ఆయన అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కుంభకోణఁపై ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో రేవంత్‌కు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని ఆయన అన్నారు. అందుకే బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు.

ఇప్పటికైనా రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలని, లేదంటే బండారం బయటపెడుతామని ఆయన అన్నారు. కెసిఆర్ కుటుంబాన్ని లక్ష్యం చేసుకుంటే మంచిది కాదని ఆయన అన్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డిపై సొంత నియోజకవర్గంలో ప్రజలు విసిగిపోయి ఉన్నారని ఆయన అన్నారు.
రేవంత్ రెడ్డి కాంట్రాక్టులను బెదిరించడం కూడా అందరికీ తెలుసునని ఆయన అఅన్నారు. తప్పులను కప్పిపుచ్చుకోవడానికే కెసిఆర్‌పై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ బిజెపి నేతలకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణకు అన్యాయం చేస్తున్న ఆంధ్ర బాబులను నిలదీయాలని ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. ఎర్రబెల్లి దయాకర్, మోత్కుపల్లి నర్సింహులులపై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి తెలంగాణలో పుట్టిన తెలంగాణ ద్రోహి అని ఆయన అన్నారు.
యుపిఎ చేసిన తప్పులే..
పోలవరం, హైదరాబాదుపై గవర్నర్‌కు అధికారాల విషయాల్లో యుపిఎ చేసిన తప్పులనే ఎన్డిఎ చేస్తోందని తెరాస నాయకుడు వేణుగోపాలాచారి అన్నారు. సమగ్ర కుటుంబ సర్వే వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన అన్నారు. సమగ్ర కుటుంబ సర్వే చేయాలని కేంద్రం ప్రభుత్వం అన్ని రాష్ట్రాలనూ ఆదేశించిందని ఆయన గుర్తు చేశారు. ఇప్పటి వరకు నిర్వహించిన ఏ సర్వే కూడా సమగ్రంగా లేదని, అందువల్లనే అక్రమాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
సర్వేపై బిజెపి, టిడిపి నాయకులు గగ్గోలు పెడుతున్నాయని, ప్రజలకే మేలు జరుగుతుందని ఆయన అన్నారు. కేంద్రంతో తెలంగాణ మంచి సంబంధాలనే కోరుకుంటోందని ఆయన అన్నారు. ఇతర రాష్ట్రాలకు వర్తించే నియమాలే తెలంగాణకు వర్తించాలని ఆయన అన్నారు.
-
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా చంద్రబాబు.. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications