TTD: మొదటి రోజే రంగంలోకి దిగిన టీటీడీ అదనపు ఈవో చౌదరి
కలియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువు తీరిన తిరుమలలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడం మా బాధ్యత అని టీటీడీ అదనపు ఈవో సీఎహెచ్, వెంకయ్య చౌదరి అన్నారు. శనివారం సీహెచ్ వెంకయ్య చౌదరి బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన డ్యూటీ మొదలుపెట్టారు. తిరుమలలోని పలు క్యూ లైన్లను, నారాయణగిరి షెడ్స్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లను శనివారం సాయంత్రం టీటీడీ ఆదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా నారాయణగిరి ఉద్యానవనాల్లోని భక్తులు వేచి ఉండే షెడ్లు, క్యూలైన్లు, లగేజీ, మొబైల్ డిపాజిట్ కౌంటర్లు, ప్రధమ చికిత్స కేంద్రాలను టీటీడీ ఆదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి తనిఖీ చేశారు.వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని స్కానింగ్ సెంటర్, భక్తులకు అందుతున్న అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు, పారిశుద్ధ్యం, తదితర సౌకర్యాలను టీటీడీ ఆదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి పరిశీలించారు.కంపార్ట్మెంటులో పారిశుద్ధ్యం మరింత మెరుగ్గా ఉండాలని ఆయన సూచించారు.

అనంతరం కంపార్ట్మెంట్ లలో శ్రీవారి సేవకులు భక్తులకు అందిస్తున్న పాలను టీటీడీ ఆదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి పరిశీలించారు. వివిధ ప్రాంతాల నుండి విచ్చేసి భక్తులకు వారందిస్తున్న సేవలను టీటీడీ ఆదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి ప్రశంసించారు.అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1, తిరుమల నంబి ఆలయంతో పాటు ఆ ఆలయ పరిసరాలను పరిశీలించి దర్శనం క్యూ లైన్లను సంబంధిత అధికారులను టీటీడీ ఆదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి అడిగి తెలుసుకున్నారు.శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు:
తిరుమల తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు.తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని జేఈఓ కార్యాలయంలో శనివారం శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలపై అధికారులతో వీరభ్రహ్మం సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జేఈఓ వీరభ్రహ్మం మాట్లాడుతూ శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నవంబరు 28వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు జరుగనున్నాయని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా నవంబరు 28వ తేదీన ధ్వజారోహణం, డిసెంబర్ 2వ తేదీన గజ వాహనం, 3వ తేదీన స్వర్ణరథం, గరుడ వాహనం, 6వ తేదీన పంచమితీర్థం, 7వ తేదీన పుష్పయాగం నిర్వహిస్తారని జేఈవో వీరభ్రహ్మం చెప్పారు.
విశేషమైన పంచమి తీర్థం నాడు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు విచ్చేసి పుణ్యస్నానాలు ఆచరిస్తారని వీరభ్రహ్మం అన్నారు. ఇందుకోసం టీటీడీ కల్పిస్తున్న భద్రతా ఏర్పాట్లు, ఇతర సౌకర్యాలను టీటీడీ జేఈఓ వీరభ్రహ్మం సమీక్షించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులను టీటీడీ జేఈఓ వీరభ్రహ్మం ఆదేశించారు.












Click it and Unblock the Notifications