TTD: క్యూ లైన్ లో భక్తుల ఆందోళన, వీడియో వైరల్ - టీటీడీ హెచ్చరిక..!!

Tirumala: తిరుమలలో దర్శన లైన్ లో భక్తుల నినాదాల వీడియో వైరల్ అవుతోంది. టీటీడీ ఛైర్మన్.. ఈవోకు వ్యతిరేకంగా భక్తులు నినాదాలు చేస్తున్న వీడియో బయటకు వచ్చింది. దీని పైన టీటీడీ స్పందించింది. భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బ‌తినేలా మాట్లాడ‌టం స‌రికాదని పేర్కొంది.
భ‌క్తుల‌ను రెచ్చ‌గొట్టి వీడియోలు చిత్రీక‌రించేవారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా, ఈ వీడియో తీసిన భక్తుడు వివరణ ఇచ్చారు. నిరసన చేస్తే త్వరగా దర్శనం ఇస్తారని అలా చేసినట్లు వివరణ ఇవ్వటం కొసమెరుపు.

వీడియో వైరల్
రాత్రి 10:30 గంటల సమయంలో ఆల్వార్ ట్యాంక్ వద్దనున్న సర్వదర్శనం క్యూ లైన్ లో ఓ కాకినాడ రూరల్ కు చెందిన అచ్చారావు అనే భక్తుడు టిటిడి యాజమాన్యం డౌన్ డౌన్ అంటూ నినాదాలతో నిరసన చేసాడు...క్యూలైన్ లో పాలు , నీళ్లు లేవు అంటూ నానా హైరానా చేశాడు‌‌‌. దీనిని వీడియో తీసారు. ఈ వీడియో వైరల్ అయింది. దీని పైన టీటీడీ విచారణ చేసింది. దీంతో, భక్తుడు ఈ వివాదం పైన వివరణ ఇచ్చారు. దర్శనానికి ఎంత సమయం పడుతుందో తెలియక ఉద్రేకంతో విచక్షణ కోల్పోయి టీటీడీ పెద్దలను తప్పుబడుతూ నినాదాలు చేసి పొరపాటు చేసానని , తను చేసిన తప్పును ఒప్పుకుంటూ క్షమాపణ చెప్పారు. ఈ వ్యవహారం పైన టీటీడీ ఏఈవో స్పందించారు.

TTD AEO Venkaiah Chowdary warns on Devotees mis leading videos in Tirumala

భక్తుడు వివరణ
శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం తిరుమ‌ల‌కు విచ్చేసే భ‌క్తుల కోసం టీటీడీ సిబ్బంది అహ‌ర్నిశ‌లు కృషి చేస్తున్నా భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బ‌తినేలా మాట్లాడ‌టం స‌రికాద‌న్నారు. వేస‌వి సెల‌వుల కార‌ణంగా తిరుమ‌ల‌లో అధిక ర‌ద్దీ నెల‌కొన‌డంతో శిలాతోర‌ణం దగ్గర మొదలవు తున్న ద‌ర్శ‌న క్యూలైన్ల‌ను ఆయ‌న శ‌నివారం ప‌రిశీలించారు. భ‌క్తుల‌కు పంపిణీ చేస్తున్న అన్న‌, పానీయాలు గురించి వారితో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. భ‌క్తులంద‌రూ టీటీడీ అందిస్తున్న సౌక‌ర్యాల‌పై అద‌న‌పు ఈవో వ‌ద్ద సంతృప్తి వ్య‌క్తం చేశారు. ఓ వ్య‌క్తి ద‌ర్శ‌న క్యూలైన్ లో అన్న ప్ర‌సాదాలు అంద‌లేద‌ని నినాదాలు చేసిన విష‌యం త‌మ దృష్టికి వ‌చ్చింద‌న్నారు.

టీటీడీ సీరియస్
ఆ భక్తుడిని వెంట‌నే సంప్ర‌దించి ఆరా తీయ‌గా త‌న‌కు ఆరోగ్యం స‌రిగ్గా లేక‌పోవ‌డంతో ర‌ద్దీ గురించి అవ‌గా హ‌న లేక‌పోవ‌డంతో ద‌ర్శ‌న స‌మ‌యం ఆల‌స్య‌మ‌వుతున్నదని తాను అసహనంతో నినాదాలు చేసిన‌ట్లు ఒప్పుకున్నారని చెప్పారు. వేస‌వి సెల‌వుల నేప‌థ్యంలో ప్ర‌తిరోజూ ఒక ల‌క్ష‌కు పైగా భ‌క్తులు స్వామివారి ద‌ర్శ‌నం కోసం వ‌స్తున్నార‌ని, వారాంతాల్లో ఈ సంఖ్య 1.20 ల‌క్ష‌లు దాటుతోం ద‌ని చెప్పారు. సాధార‌ణ రోజుల‌కంటే 10 వేల మందికి భ‌క్తుల‌కు అద‌నంగా ద‌ర్శ‌న‌మ‌ య్యేందుకు టీటీడీ సిబ్బంది రాత్రింబ‌వ‌ళ్లు నిద్ర లేకుండా క‌ష్ట‌ప‌డుతున్నార‌ని తెలియ‌జేశారు.ఇలాంటి ప్రవర్తనతో భక్తుల మనోభావాలు దెబ్బ తీసే ప్రయత్నం చేస్తే చర్యలు తప్పవని ఏఈవో హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+