టీటీడీలో మరో కొత్త వివాదం.. అప్పుడు నెయ్యి లొల్లి.. ఈసారి జీడిపప్పు !!

కలియుగ ప్రత్యక్ష దైవం అంటూ ఎంతో మందితో నిత్యం పూజలు అందుకుంటున్నారు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి. అయితే ఇటీవల శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి విషయంలో తీవ్ర వివాదం నడిచిన సంగతి తెలిసిందే. ఏపీ సర్కారుకు - వైసీపీ నేతల మధ్య కూడా మాటల యుద్ధం సాగింది. సీఎం చంద్రబాబు సైతం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించగా.. దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సుప్రీం కోర్టు కూడా ఈ వివాదంపై స్పందించింది.

అయితే ఇప్పుడు టీటీడీ మరో వివాదంలో చిక్కుకుంది. జీడిపప్పు కొనుగోలుకు సంబంధించి పిలిచిన టెండర్లలో నకిలీ పత్రాలు సమర్పించిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అంతే కాకుండా నకిలీ పత్రాలు సమర్పించిన సంస్థలపై చర్యలు తీసుకోకపోగా.. వారికి అధికారులు వత్తాసు పలకడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ttd-again-in-one-more-trouble-with-cashew-nut-tender-issue-and-news-got-viral

ఏం జరిగిందంటే..

కాగా 1.20 లక్షల కిలోల జీడిపప్పు సరఫరా కోసం టీటీడీ సెప్టెంబరు 3న టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అందుకు గానూ టెండర్‌ ప్రక్రియలో చెన్నైకి చెందిన క్రిస్టీ క్వాలిటీ ఫుడ్స్‌.. ఫంక్షనల్‌ అండ్‌ ఇన్నోవేటివ్‌ ఫుడ్స్‌తో పాటు పలు సంస్థలు పాల్గొన్నాయి. అయితే నిబంధనల ప్రకారం టెండర్‌లో పాల్గొనే సంస్థకు కనీసం 75 వేల కేజీల జీడిపప్పు సరఫరా చేసిన అనుభవం ఉండాలి. కానీ చెన్నైకి చెందిన రెండు సంస్థలు సమర్పించిన వేబిల్లులను క్యూఆర్‌ కోడ్‌తో స్కాన్‌ చేయగా అవి నకిలీవని తేలింది. దీంతో అధికారులు వాటిని టెండర్ల నుంచి డిస్‌క్వాలిఫై చేశారు.

అంతే కాకుండా నిబంధనల ప్రకారం తప్పుడు పత్రాలతో టెండర్లలో పాల్గొన్న సంస్థల ఎర్నెస్ట్‌ మనీ డిపాజిట్‌ (ఈఎండీ)ను జప్తు చేయాలి. వాటిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టి, విజిలెన్స్‌ విభాగానికి ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించాలి. కానీ టీటీడీ అధికారులు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా వ్యవహరించడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. సదరు సంస్థలకు చెందిన రూ.56 లక్షల ఈఎండీని అధికారులు తిరిగి ఇచ్చేయడం.. ఆ సంస్థలను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ తరహా నిర్లక్ష్య ధోరణితో అధికారులు వ్యవహరించడాన్ని తప్పుబడుతున్నారు.

మరోవైపు భవిష్యత్తులో జరిగే టెండర్లలో పాల్గొనేందుకు కూడా.. చెన్నైకి చెందిన ఆ రెండు కంపెనీలకు వీలు కల్పించడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. రీసెంట్ గా పిలిచిన యాలకుల టెండర్ల లోనూ ఆయా సంస్థలు పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై టీటీడీ అధికారులు సమాధానం చెప్పాలని నిలదీస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+