TTD: శ్రీవారి బ్రహ్మోత్సవాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్, కోవిడ్ నియమాలు, టీటీడీ ఈవో !
తిరుమల/ తిరుపతి: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అక్టోబరు 11న గరుడసేవ నాడు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి తెలిపారు. అదే రోజు ఎస్వీబీసీ కన్నడ, హిందీ ఛానళ్లతోపాటు పలు ప్రారంభోత్సవాలు చేస్తారని చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ ఈవో కెఎస్. జవహర్ రెడ్డి
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు పూర్తి వివరాలను వెళ్లడించారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అక్టోబరు 7 నుండి 15వ తేదీ వరకు 9 రోజుల పాటు ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనున్నామని టీటీడీ ఈవో కెఎస్. జవహర్ రెడ్డి చెప్పారు. అక్టోబరు 5న కోయిల్ ఆళ్వారు తిరుమంజనం, అక్టోబరు 6న అంకురార్పణ, అక్టోబరు 7న ధ్వజారోహణం, అక్టోబరు 11న గరుడవాహనం, అక్టోబరు 12న సాయంత్రం స్వర్ణరథం బదులుగా సర్వభూపాల వాహనం, అక్టోబరు 14న ఉదయం రథోత్సవానికి బదులుగా సర్వభూపాలవాహనం, అక్టోబరు 15 ఉదయం చక్రస్నానం (అయిన మహల్‌లో) - రాత్రి ధ్వజావరోహణం, అక్టోబరు 16న శ్రీవారి భాగ్‌సవారీ ఉత్సవం జరుగనున్నాయని టీటీడీ ఈవో కెఎస్. జవహర్ రెడ్డి వివరించారు.

ఆంధ్రప్రదేశ్ సీఎం చేతులమీదుగా ప్రారంభోత్సవాలు
అక్టోబరు 11న గరుడసేవ నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని టీటీడీ ఈవో తెలిపారు. అదే రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారని చెప్పారు. అలిపిరి పాదాల మండపం వద్ద చెన్నైకి చెందిన దాత శేఖర్‌రెడ్డి విరాళంతో నిర్మిస్తున్న గోమందిరాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఇందులో గోప్రదక్షిణ, గోతులాభారం, గోవు ప్రాశస్త్యాన్ని భక్తులకు తెలియజేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం.

అలిపిరి కాలినడక భక్తుల కోసం
అలిపిరి నుంచి తిరుమల వరకు నడక దారి పైకప్పును రిలయన్స్ సంస్థ రూ.25 కోట్ల విరాళంతో పునఃనిర్మించిన మార్గాన్ని రాబోయే బ్రహ్మోత్సవాలలో భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. తిరుమలలో ఇండియా సిమెంట్స్ రూ. 12 కోట్ల విరాళంతో నిర్మించిన నూతన బూందిపోటును అందుబాటులోకి తీసుకువస్తామని టీటీడీ ఈవో తెలిపారు.

సీఎం జగన్ చోరవతో బర్డ్ ఆసుపత్రిలో !
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు చిన్నపిల్లల కోసం తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రి పాత బ్లాక్‌లో పీడియాట్రిక్ కార్డియాక్ ఆసుపత్రి తాత్కాలిక భవన నిర్మాణపనులు పూర్తయ్యాయని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి వివరించారు. ఇందుకు సంబంధించి యంత్రపరికరాలు ఇతర వసతులు దాదాపుగా పూర్తయ్యాయని టీటీడీ ఈవో వివరించారు.

సీఎం జగన్ చేతుల మీదుగా !
శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్టోబరు 11వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి చేతులమీదుగా ఈ ఆసుపత్రిని ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు.
బర్డ్
- బర్డ్ ఆసుపత్రికి దాతలు కోట్లాది రూపాయల విలువైన పరికరాలు విరాళంగా అందించారని టీటీడీ ఈవో తెలిపారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్లు, ఆర్థోపెడిక్ డాక్టర్లు స్వచ్ఛందంగా విజిటింగ్ కన్సల్టెంట్లుగా ఓపిలు, అరుదైన ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని టీటీడీ ఈవో తెలిపారు.

టీటీడీ 2022 డైరీలు, క్యాలెండర్లు
టీటీడీ ముద్రించిన 2022 శ్రీవారి క్యాలెండర్లు, డైరీలను బ్రహ్మోత్సవాలలో తిరుమల, తిరుపతిలలోని అన్ని టీటీడీ ప్రచురణల విక్రయశాలల్లో భక్తులకు అందుబాటులో ఉంచుతామని టీటీడీ ఈవో కెస్. జవహర్ రెడ్డి వివరించారు. దేశవ్యాప్తంగా శ్రీవారి క్యాలెండర్లకు ఎంత డిమాండ్ ఉందో అనే విషయం మనందరికి తెలిసిందే,

శ్రీవారి దర్శనానికి కోవిడ్ పరీక్షలు తప్పనిసరి
- భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా సెప్టెంబరు 25వ తేదీ నుండి ఆన్ లైన్ లో సర్వదర్శనం టోకెన్ల విడుదల చేశామని టీటీడీ ఈవో తెలిపారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్ కానీ, దర్శనం సమయానికి మూడు రోజుల ముందు ఆర్‌టిపిసిఆర్ కరోనా పరీక్ష చేయించుకుని నెగిటివ్ సర్టిఫికెట్ గానీ తప్పనిసరిగా తీసుకురావాలని టీటీడీ ఈవో కెఎస్. జవహర్ రెడ్డి స్వామివారి భక్తులకు విజ్ఞప్తి చేశారు. శ్రీవారి సప్తగిరులకు సూచికగా ఏడు బ్రాండ్లతో సెప్టెంబరు 13న అగరబత్తులను భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చామని, వీటికి భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోందని, డిమాండ్‌కు తగినంత ఉత్పత్తి పెంచాల్సిన అవసరముంది టీటీడీ ఈవో అన్నారు.
డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంతో ఎంఓయు
, వివిధ ఆలయాల్లో ఉపయోగించిన పూలతో స్వామి, అమ్మవార్ల ఫోటోలు, క్యాలెండర్లు, డ్రైఫ్లవర్ మాలలు, తదితరాలు తయారు చేయడానికి డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంతో ఎంఓయు కుదుర్చుకున్నాని టీటీడీ ఈవో కెఎస్ జవహర్ రెడ్డి అన్నారు. రాబోవు రెండు, మూడు నెలలో భక్తులకు అందుబాటులోకి తెస్తామని టీటీడీ ఈవో అన్నారు.

గుడికో గోమాత
హిందూ ధర్మాన్ని విస్తృత ప్రచారం చేయడంలో భాగంగా దేశవ్యాప్తంగా గుడికో గోమాత కార్యక్రమం ప్రారంభించామని టీటీడీ ఈవో అన్నారు. దేశంలో భక్తులు ఏ ఆలయానికి వెళ్లినా గోపూజ చేసుకునే ఏర్పాటు చేయడానికి టీటీడీ సిద్ధంగా ఉందని, ఇందులో భాగంగా తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో ఇటీవల గోపూజను ప్రారంభించామని టీటీడీ ఈవో కెఎస్. జవహర్ రెడ్డి చెప్పారు. త్వరలో తిరుపతిలోని అన్ని ఆలయాల్లో గోపూజ సేవ అందుబాటులోకి వస్తుందని టీటీడీ ఈవో అన్నారు. శ్రీవారికి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో పండించిన బియ్యం, కూరగాయలు, బెల్లం, పప్పుదినుసులతో తయారు చేసిన అన్నప్రసాదాలను ఈ ఏడాది మే 1వ తేదీ నుండి నిత్య నైవేద్యంగా సమర్పిస్తున్నామని, ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగేందుకు పలువురు దాతలు ముందుకొస్తున్నారు. ఈ ఆలోచన నుంచే నవనీత సేవ కార్యక్రమం పుట్టిందని టీటీడీ ఈవో కెఎస్. జవహర్ రెడ్డి చెప్పారు.

నవనీత సేవ
దేశీయ గోవుల పాలతో తయారుచేసిన పెరుగును చిలికి వెన్న తయారుచేసి, తిరుమల శ్రీవారికి సమర్పించేందుకు ఆగస్టు 30న కృష్ణాష్టమి పర్వదినం నుంచి నవనీత సేవను ప్రారంభించామని టీటీడీ ఈవో అన్నారు. భక్తులు ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తున్నామని ఇందుకోసం భక్తుడు తిరుమల గోశాలకు రాజస్థాన్ నుండి గిర్ గోవులను తెప్పించి విరాళంగా ఇచ్చారని టీటీడీ ఈవో అన్నారు. టీటీడీ ఆధ్వర్యంలోని తిరుమల, తిరుపతి, పలమనేరు గోశాలలను అభివృద్ధి చేయాలని నిర్ణయించామని, పాలిచ్చే ఆవుల సంతతిని పెంచి తిరుమల శ్రీవారి నైవేద్యానికి కావాల్సిన నెయ్యి ఇక్కడినుంచే తయారయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నాయని, దాతలు ముందుకొచ్చి గిర్ రకానికి చెందిన దేశీయ గోవులను విరాళంగా ఇచ్చారని టీటీడీ ఈవో చెప్పారు. దీంతో పాటు ఒంగోలు, రెడ్ సింధీ, సాహ్నివాల్ లాంటి దేశీయ జాతుల ఆవులను స్వీకరించి పాల ఉత్పత్తిని పెంచుతామని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చక్కగా పనిచేస్తున్న గోశాలలకు సహకారం అందించే ప్రణాళిక తయారు చేస్తున్నామని టీటీడీ ఈవో కెఎస్. జవహర్ రెడ్డి చెప్పారు.

గో ఆధారిత వ్యవసాయం
గోఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్ర ప్రకృతి వ్యవసాయ విభాగంతో అనుసంధానం చేసుకుని రైతుల నుండి టీటీడీకి అవసరమైన 7 వేల టన్నుల శనగపప్పును కొనుగోలు చేస్తామని, టీటీడీ వద్ద ఉన్న పాలివ్వని ఆవులు, ఎద్దులను గో ఆధారిత వ్యవసాయం చేసే రైతులకు అందిస్తామని, గోమూత్రం, పేడ రైతులకు ఎరువుగా ఉపయోగపడతాయని అన్నారు. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద్ ఆయుర్వేద ఫార్మశీ సహకారంతో పంచగవ్య ఉత్పత్తుల్కెన సబ్బు, షాంపు, ధూప్ స్టిక్స్, ఫ్లోర్ క్లీనర్ లాంటి 15 రకాల ఉత్పత్తులను డిసెంబరు మాసంలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వేగంగా పనులు జరుగుతున్నాయని, అదేవిధంగా, టీటీడీ ఆయుర్వేద ఫార్మసీని బలోపేతం చేసి మరో 85 రకాల ఉత్పత్తులకు ఆయుష్ మంత్రిత్వశాఖ నుంచి లైసెన్స్ తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నాం. మరో నాలుగు నెలల్లో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని టీటీడీ ఈవో కెస్ జవహర్ రెడ్డి వివరించారు.

తిరుమల ఎస్వీ మ్యూజియం
తిరుమల ఎస్వీ మ్యూజియంలో శ్రీవారి వైభవాన్ని, చారిత్రక ప్రాశస్త్యాన్ని, వివిధ కాలాల్లో పలువురు చక్రవర్తులు, రాజులు, సామంతులు, మంత్రులు మొదలైనవారు అందించిన అలనాటి గంగాళాలు, సంగీత పరికరాలు, శ్రీవారి ఆభరణాల నమూనాలు మొదలైనవాటిని భక్తులు సందర్శించేందుకు వీలుగా టాటా గ్రూప్, టెక్ మహింద్ర, మ్యాప్ సిస్టమ్ సంస్థల సహకారంతో ఏర్పాట్లు చేపడుతున్నామని టీటీడీ ఈవో వివరించారు. జాతీయస్థాయిలో మ్యూజియంను తీర్చిదిద్ది భక్తులు సందర్శించగానే గొప్ప అనుభూతి కలిగేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఏడాదిలో ఈ పనులు పూర్తి చేస్తాం.
పుస్తక రూపంలోకి పురందర దాసుల కీర్తనలు
- కర్ణాటక రాష్ట్రానికి చెందిన హరిదాసుల సంకీర్తనలను దాస సాహిత్య ప్రాజెక్టు ద్వారా సర్వస్వం పేరుతో పుస్తక రూపంలోకి తేవాలని నిర్ణయించాని టీటీడీ ఈవో చెప్పారు. ఇప్పటికే టిటిడి వద్ద ఉన్న కీర్తనలతో పాటు మరిన్ని కీర్తనలను సేకరించి, పరిష్కరించడానికి పండిత పరిషత్‌ను ఏర్పాటు చేశామని అన్నారు. ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు రికార్డు చేసిన 300 దాస సంకీర్తనలతో దాస నమనం పేరుతో కర్ణాటకలో పాటల పోటీలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ ఈవో కెఎస్. జవహర్ రెడ్డి చెప్పారు.

శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్
అక్టోబరు 11న బ్రహ్మోత్సవాల గరుడ సేవ రోజున ఎస్వీబీసి హింది, కన్నడ భాషలలో ప్రసారాలు ప్రారంభిస్తామని, టీటీడీ రికార్డు చేసిన 4 వేల అన్నమయ్య సంకీర్తనలకు బహుళ ప్రాచుర్యం కల్పించే ఉద్దేశంతో అదివో .... అల్లదివో పేరుతో అన్నమయ్య పాటల పోటీల కార్యక్రమాన్ని ప్రారంభించామని, తిరుపతిలోని ఎస్వీబిసి కార్యాలయంలో తొలుత చిత్తూరు జిల్లా యువతకు అన్నమయ్య పాటల పోటీలకు ఎంపిక ప్రారంభమైందని టీటీడీ ఈవో చెప్పారు.
Recommended Video

లోకసంక్షేమం కోసం, కరోన వ్యాధి నావరణ కోసం !
లోక సంక్షేమం కోసం, కరోనా వ్యాధి వ్యాప్తి నివారణకు శ్రీవారిని ప్రార్థిస్తూ సెప్టెంబరు 3 నుండి 18వ తేదీ వరకు 16 రోజుల పాటు షోడశదిన బాలకాండ పారాయణ దీక్ష నిర్వహించామని, తిరుమలలో సుందరకాండ, యుద్దకాండ పారాయణానికి భక్తుల నుండి విశేష స్పందన వచ్చిందని, ఇటీవల ప్రారంభించిన బాలకాండ, గరుడ పురాణం విశేష ఆదరణ చూరగొంటున్నాయని టీటీడీ ఈవో కెఎస్. జవహర్ రెడ్డి వివరించారు. అక్టోబరు 21వ తేదీ నుండి 27 రోజుల పాటు ధర్మగిరి శ్రీవేంకటేశ్వర వేద విజ్ఞానపీఠంలో అయోధ్య కాండ పారాయణదీక్ష నిర్వహిస్తామని టీటీడీ ఈవో కెఎస్ జవహర్ రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, వీరబ్రహ్మయ్య, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎస్వీబీసీ సీఈవో సురేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
-
1,01,001 బియ్యపు గింజలపై "రామ" నామం..! -
వీళ్లా ఆలయ అధికారులు.. శ్రీరామనవమి నాడే "అశ్లీల నృత్యాల" బాగోతం !! -
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications