TTD: దర్శన వేళలు, వసతి పై పాలక మండలి కీలక నిర్ణయాలు - కొత్త రూల్స్..!!
Tirumala: టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. 2025-26వ సంవత్సరం వార్షిక బడ్జెట్‌ను రూ.5258.68 కోట్లతో పాలకమండలి ఆమోదించింది. ముంతాజ్ హోటల్ నిర్మాణానికి కేటాయించిన భూములను రద్దు చేసారు. మన దేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా శ్రీవారి ఆలయాలను నిర్మించాలని నిర్ణయించారు. బ్రేక్ దర్శనాల మార్పు తో పాటుగా భక్తుల వసతి కోసం వసతి సముదాయాల పునరుద్దరణకు నిర్ణయం తీసుకున్నారు. టీటీడీలో అన్యమత ఉద్యోగస్తులను పూర్తిగా తెలిగించాలని నిర్ణయించారు.
ముంతాజ్ భూముల రద్దు
టీటీడీ పాలకవర్గ నిర్ణయాలను ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. ముంతాజ్ హోటల్ నిర్మాణానికి వేరేచోట భూమి కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. అలిపిరి వద్ద ఉన్న 35.24 ఎకరాలతో పాటు 15ఎకరాల టూరిజం భూమిని టీటీడీ స్వాధీనం చేసుకొని.. ప్రత్యామ్నాయంగా 50ఎకరాల భూమిని మరో ప్రదేశంలో ప్రభుత్వానికి కేటాయిస్తామని చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. మన దేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా శ్రీవారి ఆలయాలను నిర్మిస్తామని వెల్లడించారు. శ్రీవాణి ట్రస్టుతో పాటు నూతనంగా ఏర్పాటు చేయబోయే మరో ట్రస్టు ద్వారా వచ్చే విరాళాలతో ఈ ఆలయాలను నిర్మిస్తామని చెప్పారు.
ప్రత్యేక కమిటీ
శ్రీవారి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ప్రత్యేకంగా కమిటీని నియమిస్తున్నామని చెప్పారు. శ్రీవారి ఆస్తులకు సంబంధించి న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. టీటీడీలో అన్యమత ఉద్యోగస్తులను తొలగిస్తామని ప్రక చారు. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తామని చెప్పుకొచ్చారు. ఏపీ లో పలు చోట్ల నిలిచిపొయిన దేవాలయాలను పునర్ నిర్మించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పోటు కార్మికులకు జీఎస్టీ భారం లేకుండా జీతం రూ.43 వేలు చెల్లించేలా నిర్ణ తీసుకున్నారు. న్స్ సిటీకి టీటీడీ కేటాయించిన 20 ఏకరాల స్థలాలను రద్దు చేశామన్నారు. టీటీడీ ఉద్యోగులకు మూడు నెలలకు ఒక్కసారి సుపథం ద్వారా దర్శనం కల్పిస్తామని ప్రకటించారు.
బ్రేక్ దర్శనాల టైమింగ్స్
తిరుమలలో లైసెన్స్ లేని హ్యాకర్ల నిర్మూలనకు రెవెన్యూ, విజిలెన్స్ శాఖ ఆధ్వర్యంలో టాస్క్ ర్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు. టీటీడీ ఉద్యోగుల నేమ్ బ్యాడ్జ్‌లు ఏర్పాటుపై అధ్యయనం చేశామని తెలిపారు. వీఐపీ బ్రేక్ దర్శనాలు గతంలో మాదిరిగానే ఉదయం 6 గంటలకు ప్రారంభించాలని సూచించామని చెప్పారు. తిరుపతి గంగమ్మ, తలకోన, కర్నూల్ జిల్లాలో బుగ్గ, అనకాపల్లిలోని ఉపమాక, ధర్మవరం, తెలంగాణలోని కొడంగల్, సికింద్రాబాద్, కరీంనగర్‌లలో నూతనంగా ఆలయాలు నిర్మిస్తున్నామని ప్రకటించారు. 180 మంది కాంట్రాక్టు లెక్చరర్‌లకు జీత భత్యాల పెంపుపై కమిటీ వేశామని చెప్పారు. వికలాంగులు, వృద్ధులకు అఫ్‌లైన్‌లో టికెట్స్ జారీపై కమిటీ వేశామని చెప్పారు.
ఏఐ సేవల వినియోగం
అదే విధంగా ఆగమ సలహా మండలిని రద్దు చేశామని.. త్వరలోనే నూతన కమిటీని నియమిస్తామని స్పష్టం చేశారు. శ్రీనివాసం స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ధికి కోటి రూపాయలు నిధులు మంజూరు చేశామని అన్నారు. గూగుల్ సంస్థ ద్వారా తిరుమల కార్యకలాపాల్లో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు. ఈ సమావేశంలో భవిష్యత్తులో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పరిధిలోని శ్రీవారి ఏడు కొండలకు ఆనుకుని ఉన్న ప్రాంతా లో ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు చేపట్టకుండా నిర్ధిష్టమైన కార్యాచరణ అమలు చేయాలని డిసైడ అయ్యారు. ఇప్పటికే ఏడు కొండల ఆనుకుని వున్న భూముల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రభుత్వ విభాగాలకు చెందిన భూములను టిటిడి స్వాధీనం చేసుకుని, వాటికి ప్రత్యామ్నాయంగా చూపడానికి, ఈ అంశంపై తదుపరి చర్యల కొరకు ప్రభుత్వానికి నివేదిస్తామని ఛైర్మన్ చెప్పారు.

ఉద్యోగుల విషయంలో
రానున్న రోజుల్లో శ్రీవారి ఏడు కొండలకు ఆనుకుని వున్న భూములలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రమే జరిగేలా ధార్మిక చట్టాల్లో సవరణలు తీసుకొస్తామని వెల్లడించారు. శ్రీవారికి దేశ వ్యాప్తంగా ఉన్న ఆస్తులను పరిరక్షించడం, వాటిని సద్వినియోగపరచడం ప్రధాన లక్ష్యంగా విస్తృత చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. న్యాయస్థానాల్లో వివాదాల్లో ఉన్న స్వామివారి ఆస్తుల వివాదాలను వేగంగా విచారణ ప్రక్రియ పూర్తి అయ్యి సద్వినియోగంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని నిర్ణయించారు. శ్రీవారి పవిత్ర భూమిలో ఒక్క అంగుళం కూడా అనధికార ఆక్రమణలు ఉండకుండా చర్యలు తీసుకుంటామని ఛైర్మన్ వెల్లడించారు. టిటిడిలో విధులు నిర్వహించే ఉద్యోగులు అందరూ హిందూ ధర్మానుసారం మాత్రమే ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు.
ఆలయాల పునరుద్ధరణ
ప్రస్తుతం విధుల్లో ఉన్న ఇతర మతస్థులను వారి హోదాకు తగినట్లుగా, వారి మనోభావాలకు భంగం కలగకుండా వివిధ ప్రత్యామ్నాయ పద్దతుల ద్వారా వారిని బదిలీ లేదా విఆర్ఎస్ ఇచ్చేం దుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని స్పష్టం చేసారు. అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం కోసం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయా రాజధానుల్లో భూమి కేటా యించాలని కోరుతూ లేఖలు రాశామని చెప్పారు. భూమి కేటాయింపులు అనుసరించి వేగంగా అన్ని రాష్ట్రాల రాజధానులలో శ్రీవారి ఆలయాల నిర్మాణాన్ని మొదలు పెడతామని వెల్లడించారు. అదే విధంగా.. రాష్ట్రంలోని చిన్న చిన్న పట్టణాలు, గ్రామాలు, దళిత వాడల్లో ఆర్ధిక స్థోమత లేక నిర్మాణంలో ఆగిపోయిన దేవాలయాలను, శిధిలావస్థకు చేరిన దేవాలయాలను పునరుద్ధరించా లని నిర్ణయించినట్లు వివరించారు.

అన్ని రాష్ట్రాల్లో ఆలయాలు
ఇక, కొత్త దేవాలయాల నిర్మాణ ప్రతిపాదనలకు కూడా ఆర్థిక సహకారం అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమాల కోసం కోసం శ్రీవాణి ట్రస్టు నుంచి ఆర్థిక సాయం అందించి, రాష్ట్రంలో దేవాలయా పునరుద్ధరణ మరియు నిర్మాణ కార్యక్రమాలను వేగంగా పూర్తి చేయిస్తామని చెప్పారు. ఈ ప్రక్రియకు టిటిడి అధిక ప్రాధాన్యత ఇస్తూ.. నిరంతరాయంగా, ఎక్కడా రాజీపడకుండా దేవాలయాల అభివృ ధి కార్యక్రమాల ద్వారా రాష్ట్రం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లేలా చర్యలు చేపట్టడం జరుగుతుందని వివరించారు. ఇటీవల అమరావతిలో శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వ హించిన అంశాన్ని ప్రస్తావించారు. అదే విధంగా రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో శ్రీవారి కళ్యాణాలు వైభవంగా నిర్వహించేందుకు చర్యలు చేపడతామని ఛైర్మన్ నాయుడు వెల్లడించారు. భక్తుల సౌకర్యాల కు అధిక ప్రాధాన్యత ఇస్తూ కార్యాచరణ సిద్దం చేస్తున్నట్లు స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications