తిరుమల కొండల్లో మరో అద్భుతం - 'ఆనంద' శోభ, కొత్త రూపు..!!
Tirumala: తిరుమల యాత్రికులకు కొత్త అనుభూతి దక్కనుంది. పరమ పవిత్రంగా భావించే తిరుమల కొండల్లో ఆధ్మాత్మిక భావన మరింత పెంచేందుకు టీటీడీ కసరత్తు చేస్తోంది. తిరుమల కు యాత్ర మొదలయ్యే ప్రాంతం నుంచి కొండ పైన మరింత శోభను పెంచే చర్యలకు ప్రాధాన్యత ఇస్తోంది. భక్తులకు ఆధ్మాత్మిక భావనతో పాటుగా ఆహ్లాదం పంచేలా తిరుమల గిరుల్లో ఆకర్షనీయ కొత్తదనం తీసుకొస్తోంది. ఇందుకు సంబంధించి టీటీడీ బోర్డు సభ్యులుగా ఉన్న ఆర్ట్ డైరెక్టర్.. డిప్యూటీ సీఎం పవన్ సన్నిహితుడు ఆనంద్ సాయికి బాధ్యతలు అప్పగించారు.
కొత్త రూపు
తిరుమలకు వచ్చే దారులకు కొత్త శోభ తెచ్చేందుకు టీటీడీ నిర్ణయించింది. కోట్లాది భక్తులు తరలి వచ్చే తిరుపతి - తిరుమల వైభవం పెరిగేలా ప్రణాళికలు సిద్దం చేసింది. తిరుమల ఐకానిక్‌గా ఆధ్యాత్మిక శోభను తీసుకువచ్చేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. దీంతో, వాటి డిజైన్లలో ఆర్ట్ డైరెక్టర్, టెంపుల్ ఆర్కిటెక్ట్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్‌సాయి బాధ్యత తీసుకున్నారు. నిత్యం వేలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే తిరుపతి విమానాశ్రయంలో తిరుమల శోభ ఉండేలా మార్పులకు శ్రీకారం చుట్టారు. దీంతో, తొలి ప్రాధాన్యతగా తిరుపతి ఎయిర్‌పోర్టుకు 'శ్రీవేంకటేశ్వర ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు'గా పేరు పెట్టాలని తీర్మానం చేసి కేంద్ర విమానయాన శాఖకు ప్రతిపాదన పంపాలని నిర్ణయించారు. అలాగే బోర్డు సభ్యుడు ఆనంద్‌సాయి ప్రతిపాదన మేరకు ఎయిర్‌పోర్టును పూర్తిస్థాయిలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ వైభవంతో ఆధ్యాత్మిక వాతావరణం ఉండేలా తీర్చిదిద్దాలని నిర్ణయించారు.

ప్రణాళికలు సిద్దం
తిరుపతి విమానాశ్రయం.. అలిపిరి ఆర్చ్ కు కొత్త రూపు వచ్చేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. తిరుమల ఐకానిక్‌గా ఆధ్యాత్మిక శోభను తీసుకువచ్చేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. దీంతో, వాటి డిజైన్లలో ఆర్ట్ డైరెక్టర్, టెంపుల్ ఆర్కిటెక్ట్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్‌సాయి బాధ్యత తీసుకున్నారు. నిత్యం వేలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే తిరుపతి విమానాశ్రయంలో తిరుమల శోభ ఉండేలా మార్పులకు శ్రీకారం చుట్టారు. దీంతో, తొలి ప్రాధాన్యతగా తిరుపతి ఎయిర్‌పోర్టుకు 'శ్రీవేంకటేశ్వర ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు'గా పేరు పెట్టాలని తీర్మానం చేసి కేంద్ర విమానయాన శాఖకు ప్రతిపాదన పంపాలని నిర్ణయించారు. అలాగే బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి ప్రతిపాదన మేరకు ఎయిర్‌పోర్టును పూర్తిస్థాయిలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ వైభవంతో ఆధ్యాత్మిక వాతావరణం ఉండేలా తీర్చిదిద్దాలని నిర్ణయించారు.

మహా మండపం రూపు
అదే విధంగా అలిపిరి గరుడ సర్కిల్‌లోని ఆర్చిని కూడా ఆధునికీకరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం, శంషాబాద్ సమీపంలోని రామానుజా చార్యుల ఆశ్రమ రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన ఆనంద్‌సాయికే ఈ బాధ్యత అప్పగించారు. తన ప్రణాళికల పైన ఆనంద్ సాయి స్పందించారు. కొద్ది నెలల క్రితం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు కాలినడకన తిరుమలకు వచ్చిన సందర్భంలో అలిపిరి నుంచి శ్రీవారి ఆలయం వరకు చేపట్టాల్సిన అభివృద్ధి, ఆధ్యాత్మిక వాతావరణంపై చర్చించు కున్నట్లు చెప్పారు. ఓ మహా మండపంలోకి ప్రవేశిస్తున్నామనే భావన భక్తులందరికీ కలిగేలా అలిపిరి ఆర్చిని డిజైన్ చేసేలా ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
కొత్త అనుభూతి
ప్రస్తుతం ఇండోనేషియా తరహాలో ఉన్న ఎయిర్‌పోర్టును కూడా తిరుమల క్షేత్రం భావన కలిగేలా తీర్చిదిద్దాలని ప్లాన్ చేస్తున్నామన్నారు. ఇప్పటికే తన మదిలో ఒక డిజైన్ సిద్దం చేసినట్లు చెప్పారు. బోర్డు.. పవన్.. చంద్రబాబుతో చర్చించి.. ఆమోదిస్తామని ఆనంద్ సాయి చెప్పుకొచ్చారు. ఇది మొదలైతే.. తిరుమల భక్తులకు కొత్త అనుభూతి కలగనుంది. త్వరలోనే ఈ మేరకు టీటీడీ అధికారికంగా ఈ ప్రక్రియ ప్రారంభించేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications