Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మాజీ ఉద్యోగులకు సీఎం జగన్ బంపర్ ఆఫర్, 200 ఎకరాలకు స్కెచ్, భూమన !

తిరుపతి/తిరుమల: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుపతి, తిరుమల పర్యటనకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 18వ తేదీన సీఎం జగన్ తిరుపతిలో శ్రీనివాస సేతు ప్రారంభిస్తారని, అదే రోజు టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు పంపిణి చేస్తారని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి మీడియాకు చెప్పారు.

శుక్రవారం టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమనకరుణాకర రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుపతిలోని గంగమ్మ ఆలయాన్ని సందర్శిస్తారని భూమన కరుణాకర రెడ్డి అన్నారు. టీటీడీ ఉద్యోగులతో పాటు టీటీడీ రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఇంటి స్థలాలు ఇస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏ ఒక్కరినీ అసంతృప్తికి గురి చేసే ప్రసక్తే లేదని భూమన కరుణాకర రెడ్డి స్పష్టం చేశారు.టీటీడీ ఉద్యోగులకు ఇంటిస్థలాల పంపిణీ కోసం ఏర్పాటు చేస్తున్న వేదిక, శ్రీనివాస సేతు, శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో జరుగుతున్న పనులను శుక్రవారం మధ్యాహ్నం అధికారులతో కలసి భూమన కరుణాకర రెడ్డి పరిశీలించారు.

TTD Chairman Karunakara Reddy inspected various works on the occasion of CM Jagans visit to Tirupati.

ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి మీడియాతో మాట్లాడారు. సెప్టెంబరు 18వ తేదీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. అంతకు ముందు తిరుపతి నగరం సిగలో మరో మణిహారం కాబోతున్న శ్రీనివాససేతు సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని భూమన కరుణాకర రెడ్డి తెలిపారు.

సుమారు రూ. 650 కోట్లతో నిర్మించిన ఈ వంతెనపై 19వ తేదీ నుండి వాహనాల రాకపోకలు అనుమతిస్తారని భూమన కరుణాకర రెడ్డి అన్నారు. యాత్రీకులు, స్థానికులకు కూడా శ్రీనివాస సేతు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భూమన కరుణాకర రెడ్డి చెప్పారు. అనంతరం టీటీడీ ఉద్యోగులకు కొందరికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఇంటి స్థలాలు పంపిణీ చేస్తారని భూమన కరుణాకర రెడ్డి చెప్పారు.

TTD Chairman Karunakara Reddy inspected various works on the occasion of CM Jagans visit to Tirupati.
టీటీడీ రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఇంటిస్థలాలు ఇవ్వడం కోసం మరో 200 ఎకరాలు కావాలని తాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కోరామని, 200 ఎకరాల భూమి సమీకరణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారని టీటీడీ చైర్మన్ శ్రీ కరుణాకర రెడ్డి వివరించారు.

ఈ కార్యక్రమాలు ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లిని దర్శించుకుంటారని భూమన్ కరుణాకర రెడ్డి తెలిపారు. సుమారు 400 సంవత్సరాల క్రితం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు మొదట శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ను దర్శించే వారని భూమన కరుణాకర రెడ్డి అన్నారు.

TTD Chairman Karunakara Reddy inspected various works on the occasion of CM Jagans visit to Tirupati.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గత సంవత్సరం నుంచి ఈ సంప్రదాయాన్ని పునరుద్ధరించడం పట్ల తిరుపతి వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని భూమన కరుణాకర రెడ్డి తెలిపారు. ఈ సంవత్సరం కూడా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శ్రీ తాతయ్య గుంట గంగమ్మను దర్శించుకున్నాకే తిరుమల చేరుకుని శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళతారని కరునాకర రెడ్డి చెప్పారు.

తమది అభివృద్ధి, ఆధ్యాత్మిక, ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వమని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి పునరుధ్ఘాటించారు.ఈ కార్యక్రమంలో తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష, టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి హరిత, టీటీడీ చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, కార్పొరేషన్ ఎస్ఈ మోహన్, ఆఫ్కాన్ సంస్థ మేనేజర్ రంగ స్వామి తదితర అధికారులు పాల్గొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+