• search
 • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

TTD: అశ్వవాహనంపై అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, కన్నుల పండగ, శ్రీవారి సేవలో సీజేఐ !

|

తిరుమ/ తిరుపతి: శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన గురువారం రాత్రి 7 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీమలయప్పస్వామి వారు క‌ల్కి అలంకారంలో అశ్వ వాహ‌నంపై దర్శనమిచ్చారు.
ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనాదిరూఢుడై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నాడు.

 శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్ వి. రమణ

శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్ వి. రమణ


వాహ‌న‌సేవ అనంత‌రం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌.వి.ర‌మ‌ణ శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు.
తిరుమల చేరుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణకు శ్రీ పద్మావతి అతిథి గృహల వద్ద ఆయనకు టీటీడీ ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్ రెడ్డి, అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, ఇత‌ర ఉన్నాతాధికారులు స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు.

 శ్రీవారి దర్శనం చేసుకున్న న్యాయమూర్తులు

శ్రీవారి దర్శనం చేసుకున్న న్యాయమూర్తులు

ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ హిమా కోహ్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ప్ర‌శాంత్ కుమార్ మిశ్రా, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ల‌లిత‌కుమారి, జస్టిస్ స‌త్య‌నారాయ‌ణ మూర్తి, ఛత్తీస్ ఘడ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పార్త్ ప్రతీం సాహు, కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.సోమరజన్, శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి, టీటీడీ ఛైర్మ‌న్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో డాక్ట‌ర్‌ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి దంప‌తులు, అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, సివిఎస్వో గోపినాథ్ జెట్టి దంపతులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

 పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సీజేఐ

పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సీజేఐ


అంత‌కుముందు తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.ర‌మ‌ణ దర్శించుకున్నారు.

ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి టిటిడి జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, అర్చ‌కులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

ద‌ర్శ‌నానంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

మంచికి, ధ‌ర్మానికే అంతిమ విజ‌యం లభిస్తుందిని విజ‌య‌ద‌శ‌మి

మంచికి, ధ‌ర్మానికే అంతిమ విజ‌యం లభిస్తుందిని విజ‌య‌ద‌శ‌మి


టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్ రెడ్డి శ్రీవారి భక్తులకు, టీటీడీ ఉద్యోగుల‌కు గురువారం ఒక ప్రకటనలో ద‌స‌రా శుభాకాంక్షలు తెలియజేశారు.

మంచికి, ధ‌ర్మానికే అంతిమ విజ‌యం లభిస్తుందని విజ‌య‌ద‌శ‌మి మానవాళికి సందేశం ఇస్తోందన్నారు. ప్రజలందరూ ఆరోగ్యం గా, ఆనందంగా, సుఖశాంతులతో ఉండాలని వారు ఆకాంక్షించారు.
ప్రజలందరూ ధర్మమార్గంలో నడవడం ద్వారా శ్రీవారి కృపకు పాత్రులు కావాలని ఛైర్మన్‌, ఈవో కోరారు.

  'Anjanadri' In Tirumala is Hanuman''s Birthplace ఆంజనేయుడి జన్మస్థలం ఎక్కడ.? || Oneindia Telugu
  హిందూ ధార్మిక ప్రాజెక్టు

  హిందూ ధార్మిక ప్రాజెక్టు


  శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా టిటిడి హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో తిరుమ‌ల నాద‌నీరాజ‌నం వేదిక‌పై, వ‌సంత మండ‌పంలో ధార్మిక‌, సంగీత కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. బ్ర‌హ్మోత్స‌వాల్లో 8వ‌ రోజు గురువారం వివిద కార్య‌క్ర‌మాలు జరిగాయి.


  తిరుప‌తికి చెందిన భార‌తీయ విద్యాభ‌వ‌న్ క‌ళాబృందం స‌భ్యులు శ్రీ విష్ణు స‌హ‌స్ర‌నామ స్తోత్ర పారాయ‌ణం చేశారు.

  English summary
  TTD: CJI NV Ramana offer Prayer at Tirumala temple today in Andhra Pradesh.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X