Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

TTD:90 రోజుల తరువాతే మళ్లీ శ్రీవారి దర్శనం- తాజా మార్గదర్శకాలు..!!

Tirumala: తిరమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భారీ వర్షాలతో తిరుమలలో ఐదు ప్రధాన జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి. స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలనే టీటీడీ పాలకమండలి నిర్ణయం మేరకు తాజాగా మార్గదర్శకాలు జారీ చేసారు. ఇక, అన్నదాన పథకానికి విరాళాలు ఇచ్చే ప్రక్రియను సులభతరం చేస్తూ టీటీడీ కొత్త విధానం అమల్లోకి తెచ్చింది. స్థానిక భక్తులకు దర్శనం విషయంలో టీటీడీ కొత్త నిబంధన విధించింది.

మార్గదర్శకాలు ఖరారు
తిరుప‌తి స్థానికుల‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌నం క‌ల్పించాల‌ని ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు ప్ర‌తి నెలా మొదటి మంగళవారం ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. డిసెంబ‌రు 3వ తేది స్థానికుల‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌నం క‌ల్పించ‌నున్నారు. ఇందు కోసం ఈ రోజు (డిసెంబరు 2)తేది తిరుపతిలోని మహతి ఆడిటోరియం, తిరుమలలోని బాలాజీ నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో దర్శన టోకెన్లను ఉచితంగా జారీ చేస్తున్నారు. అదే విధంగా ఈ దర్శన కోటా కు సంబంధించి మార్గదర్శకాలను ఖరారు చేసారు. స్థానికుల కోసం ⁠తిరుపతిలోని మహతి ఆడిటోరి యంలో 2,500 టోకెన్లు, తిరుమ‌ల‌లోని బాలాజీ న‌గ‌ర్ క‌మ్యూనిటీ హాల్ లో 500 టోకెన్లు జారీ చేస్తున్నారు.

TTD decide Darshan eligibility is only after 90 days for local devout category

90 రోజులకు ఒక దర్శనం
టోకెన్ల జారీలో ముందుగా వ‌చ్చిన‌వారికి తొలి ప్రాధాన్య‌త‌తో కేటాయిస్తున్నారు. ⁠దర్శన టోకెన్ పొందడానికి స్థానికులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డును త‌ప్ప‌నిస‌రిగా తీసుకురావాలి. టోకెన్లు పొందిన భ‌క్తులు ద‌ర్శ‌న స‌మ‌యంలో ఒరిజిన‌ల్ ఆధార్ కార్డును తీసుకురావాల్సి ఉంటుంది.⁠వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని ఫుట్ పాత్ హాల్‌(దివ్య ద‌ర్శ‌నం) క్యూలైన్ లో భ‌క్తుల‌ను ద‌ర్శ‌నాల‌కు అనుమ‌తిస్తారు. ఇతర దర్శనాల్లో ఇచ్చేవిధంగా ద‌ర్శ‌నానంత‌రం ఒక లడ్డూ ఉచితంగా ఇవ్వనున్నారు. స్థానికుల కోటాలో దర్శనం చేసుకున్న వారికి తిరిగి 90 రోజుల వ‌ర‌కు ద‌ర్శ‌నం చేసుకునేందుకు అవకాశం ఉండదని టీటీడీ స్పష్టం చేసింది.

అన్నదాన విరాళం కోసం
ఇక, టీటీడీ నిర్వహిస్తున్న ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు విరాళం ఇచ్చేందుకు తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఏర్పాటు చేసిన‌ కియోస్క్ మిషన్ ను టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ప్రారంభించారు. ఈ మిషన్ల ద్వారా భక్తులు ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు తమకు తోచిన మొత్తాన్ని కియోస్క్ మిషన్ లోని క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేసి యూపీఐ ద్వారా సులభతరంగా విరాళం ఇవ్వవచ్చు. అటు భారీ వర్షాలతో తిరుమలలో ఐదు ప్రధాన జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి. వరదనీటి ప్రవాహంతో పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాల్లోకి నీరు చేరుకుంటోంది. గోగర్భం డ్యామ్ పూర్తిగా నిండిపోవడంతో గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్ర‌స్తుత నీటి నిల్వ‌లు తిరుమ‌ల‌కు 200 రోజుల తాగునీటి అవ‌స‌రాల‌కు స‌రిపోతాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+