TTD: శ్రీవారి సేవకులుగా వీరికి అవకాశం, కొత్త బాధ్యతలు- నూతన మాడ్యూల్..!!
Tirumala: టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి సేవకుల విధానంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టంది. ఇందుకోసం టీటీడీ వెబ్‌సైట్లో నూతన మాడ్యూల్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా తిరుమల శ్రీ వారి సేవకు వచ్చే వాలంటీర్లకు శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన శ్రీవారి సేవకులు దరఖాస్తు చేసుకోవాలని టీటీడీ కోరింది. ప్రొఫెషనల్స్, ఎన్‌ఆర్‌ఐలూ సేవలో పాల్గొనేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. బ్రహ్మోత్సవాలు.. భక్తుల సేవలతో పాటుగా టీటీడీ ఆస్పత్రుల్లోనూ సేవలు అందించేలా శిక్షణ ఇవ్వాలని డిసైడ్ అయింది.
శ్రీవారి సేవలో సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. ఇందులో భాగంగా సేవకులకు ఐఐఎం అహ్మదాబాద్, రాష్ట్ర ప్రభుత్వ డైరెక్టర్ ఆఫ్ ప్లానింగ్ ఆధ్వర్యంలో శిక్షణ అందిస్తామని చెప్పారు. ప్రొఫెషనల్స్, ఎన్‌ఆర్‌ఐలూ సేవలో పాల్గొనేందుకు త్వరలో ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లు వెల్లడించారు. టీటీడీలోనూ గ్రూప్ సూపర్‌వైజర్లు, శ్రీవారి సేవా ట్రైనర్లు, ఎన్‌ఆర్‌ఐలు, ప్రొఫెషనల్స్‌తో స్వచ్ఛందంగా సేవలు అందించాలని నిర్ణయించినట్లు చె్పారు. ఇందుకోసం టీటీడీ వెబ్‌సైట్లో నూతన మాడ్యూల్‌ను ప్రారంభించింది. అలా శ్రీవారి సేవ ప్రొఫెషనల్‌గా రూపాంతరం చెందనుంది. శ్రీవారి సేవకు సంబంధించి ప్రతి నెలా మూడు నెలల కోటాను టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేస్తారు.

శ్రీవారి సేవలో ఎక్స్‌లెంట్ గ్రేడింగ్ పొందినవారి సేవలను రద్దీ సమయాలు, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి తదితర రోజుల్లో కూడా వినియోగించుకుంటారు. వీరు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోకపోయినా నేరుగా తిరుమలకు వచ్చి శ్రీవారి సేవలో పాల్గొనవచ్చుని స్పష్టం చేసారు. 'నీ హైందవ సనాతన ధర్మ పర్యవేక్షణ' సైనికులుగా శ్రీవారి సేవకులను వినియోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విదేశాలలో ఉన్న ఎందరో ఎన్నారై నిపుణులు శ్రీవారి సేవలో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని కోరుతున్నారని.. వివిధ వృత్తులలో ప్రావీణ్యం కల్గిన నిపుణులకు శ్రీవారి సేవకు అవకాశం కల్పిస్తున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు. గ్రూపు సూపర్ వైజర్లుగా సేవా కాల పరిమితి 15 రోజులు, 30 రోజులు, 90 రోజులు, విద్యార్హత: కనీసం డిగ్రీ పూర్తి చేసి ఉండాలని టీటీడీ నిర్దేశించింది.












Click it and Unblock the Notifications