Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

TTD: భక్తులకు లడ్డూ ప్రసాదంపై అనూహ్య నిర్ణయం- ఆ దాతలకు బ్రేక్ దర్శనం..!!

Tirumala: టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. నూతన పాలక వర్గం భక్తులకు దర్శ నం తో పాటుగా లడ్డూ ప్రసాదాల విషయంలోనూ మార్పులు తెలుస్తోంది. భక్తులకు కోరినన్ని లడ్డూ లు ఇవ్వాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించిన టీటీడీ ఈ మేరకు అదనంగా తయారీకి ప్రణాళికలు సిద్దం చేస్తోంది. అదే విధంగా ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని నిర్ణయించారు.

భక్తులకు కోరినన్ని లడ్డూలు
టీటీడీలో కొత్త నిర్ణయాలు అమల్లోకి వస్తున్నాయి. ఇక నుంచి శ్రీవారి భక్తులకు కావాల్సినన్ని లడ్డూ లు ఇచ్చేందుకు టీటీడీ కసరత్తు చేస్తోంది. భక్తులు కోరిన విధంగా లడ్డూలు అందుబాటులో ఉంచలని నిర్ణయించారు. ఈ మేరకు లడ్డూ తయారీతో పాటుగా పంపిణీకి అదనపు సిబ్బంది ఏర్పాటు పైనా కార్యాచరణ సిద్దమైంది. టీటీడీలో ప్రస్తుతం ప్రతీ రోజు మూడున్నార లక్షల చిన్న లడ్డూలు, ఆరు వేల వరకు పెద్ద లడ్డూలు (కళ్యాణం లడ్డూ), మూడున్నార వేలకు పైగా వడలు తయారు చేస్తోంది. శ్రీవారి దర్శనం కు వచ్చే భక్తులతో పాటుగా పలు నగరాల్లోని స్థానిక ఆలయాల్లో నూ లడ్డూలు అందుబాటులో ఉంచుతున్నారు.

TTD decided to provided laddu prasadam on Devotees demand VIP break for Ananta Swarnyamaym donors

సిబ్బంది - కార్యాచరణ
తిరుమలకు వచ్చే భక్తులు స్వామి వారి లడ్డూ ప్రసాదం మరింత పొందేందుకు ప్రయత్నిస్తారు. స్వామి ప్రసాదం ఇతరులకు పంపిణీ చేసేందుకు తిరుమలకు వచ్చిన భక్తులు మరిన్ని లడ్డూలు తీసుకోవటానికి ప్రాధాన్యత ఇస్తారు. దీంతో, ఇక నుంచి భక్తులు కోరినన్ని లడ్డూలు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. సెలవులు, పర్విదినాలు, ప్రత్యేక రోజుల్లో లడ్డూలకు రెట్టింపు డిమాండ్ ఉంటుంది. దీంతో, భక్తుల డిమాండ్ మేరకు లడ్డూలు అందుబాటులో ఉంచేందుకు ప్రసాదం తయారీ కోసం మరో 74 మంది శ్రీవైష్ణవులతో పాటుగా అదనపు సిబ్బందిని సిద్దం చేస్తున్నారు. పోటు సిబ్బంది ద్వారా అదనపు లడ్డూలను సిద్దం చేసి..భక్తులకు పంపిణీకి టీటీడీ సిద్దం అవుతోంది. అదే సమయంలో టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

దాతలకు బ్రేక్ దర్శనం
శ్రీవారి ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. తాజాగా పునరుద్దరించిన ఈ పథకం లో దాతలకు అర్చనానంతర దర్శనం కల్పించాలని డిసైడ్ అయ్యారు. విరాళం ఇచ్చిన దాత కుటుంబంలోని అయిదుగురు సభ్యులకు ఏడాదిలో మూడు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనం తో పాటుగా ఇతర సౌకర్యాలు కల్పిస్తారు. తొలి సారి దర్శన సమయంలో అయిదు గ్రాముల బంగారు డాలర్, 50 గ్రాముల వెండి నాణెం బహుమతిగా ఇస్తారు. విరాళం ఇచ్చిన నాటి నుంచి 25 ఏళ్ల పాటు ఈ సేవ అందుబాటులో ఉంటుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+