TTD: వైకుంఠ ద్వార దర్శనం దక్కాలంటే - భక్తులకు టీటీడీ కీలక సూచనలు..!!
Tirumala: తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులు.. కొత్త ఏడాది ప్రారంభ వేళ భక్తులు కొండకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వారా దర్శనం కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. పది రోజుల పాటు భక్తులకు దర్శనం అందేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆఫ్ లైన్ లో దర్శన టోకెన్లు ఇచ్చేందుకు ఇప్పటికే సమయం ఖరారు చే సారు. ఇదే సమయంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది.
ప్రత్యేక ఏర్పాట్లు
వైకుంఠ ద్వార దర్శనం కొరకు భక్తులు క్యూలైన్లలో ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా భక్తులకు టైంస్లాట్ టోకెన్లు జారీ చేస్తామని ఈవో శ్యామలా రావు చెప్పారు. ఇప్పటికే 1.40 లక్షల రూ.300/- ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లను విడుదల చేసామన్నారు. శ్రీవాణి దర్శన టికెట్లు జనవరి 10న 1500, మిగిలిన 9 రోజులలో రోజుకు 2000 టికెట్లు ఇవ్వనున్నారు. గదుల కోటాను డిసెంబరు 23న ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఈ టికెట్లను పొందిన భక్తులకు మహా లఘు దర్శనం ఉంటుందని ఈవో వెల్లడించారు.

వీరికే అవకాశం
ఆన్‌లైన్‌లో దర్శనం బుక్ చేసుకున్న దాతలను రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన క్యూలైన్ ద్వారా దర్శనానికి అనుమతించనున్నారు. సామాన్య భక్తుల సౌకర్యార్థం జనవరి 8 నుండి 11వ తేదీ వరకు దాతలకు గదుల కేటాయింపు ఉండదు. మిగతారోజుల్లో దాతలు యథావిధిగా గదులు బుక్ చేసుకోవచ్చు. తిరుపతిలోని 8 కేంద్రాలలో 87 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకు ని మొత్తం 91 కౌంటర్ల ద్వారా టోకెన్లు మంజూరు చేస్తామని ఈవో చెప్పారు. జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి మొదటి మూడు రోజులకు జనవరి 9వ తేదీన ఉదయం 5 గం.ల నుండి 1.20 లక్షల టోకెన్లు జారీ చేయనున్నారు.
బ్రేక్ దర్శనాలు రద్దు
తదుపరి రోజులకు (13 నుండి 19వ తేదీ వరకు) ఏ రోజుకారోజు ముందు రోజు భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసంలలో టోకెన్లు జారీ చేస్తామని చెప్పారు. సర్వదర్శనం టోకెన్ల కలిగిన భక్తులు తమకు కేటాయించిన సమయానికి తిరుమలకు వచ్చి స్వామివారి దర్శించుకోవాలని సూచించారు. దర్శనటోకెన్లు గల భక్తులను మాత్రమే తిరుమ ల శ్రీవారి దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. భక్తులు ఈ విషయాన్ని గుర్తించాలని ఈవో కోరారు. ఈ 10 రోజులలో విఐపి బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించరని స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications