TTD: వీఐపీ కోటా భక్తులకు ఈవో ధర్మారెడ్డి కీలక సూచన - ఇక అవసరం లేదు..!!

Tirumala: టీటీడీ ఈవో ధర్మారెడ్డి పలు కీలక విషయాలను వెల్లడించారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమం ద్వారా భక్తుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అందులో భాగంగా... శ్రీవారి దర్శనార్థం విచ్చేసి గదులు పొందిన భక్తులకు ప్రస్తుతం రీఫండ్‌కు సంబంధించిన సమాచారాన్ని ఎస్ఎంఎస్‌ ద్వారా పంపుతున్నామని, త్వరలో రీఫండ్‌ను ట్రాక్‌ చేసేందుకు టీటీడీ వెబ్‌సెట్‌లో ట్రాక్‌ర్‌ను పొందుపరుస్తామని చెప్పారు. పే లంక్ ఎస్ఎంఎస్ గురించి వివరించారు.

డిపాజిట్‌ మొత్తం రీఫండ్‌ : తిరుమలలో యుపిఐ విధానంలో చెల్లింపులు చేసి గదులు పొందిన భక్తులకు వారు గదులు ఖాళీ చేసిన వెంటనే కాషన్‌ డిపాజిట్‌ మొత్తం రీఫండ్‌ చేయడం జరుగుతోంద‌ని చెప్పారు. క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డు ద్వారా చెల్లింపులు చేసి గదులు పొందిన భక్తులకు 3 నుంచి 5 పనిదినాలలోపు వారి ఖాతాలకు కాషన్‌ డిపాజిట్‌ మొత్తం జమ చేస్త‌న్నామ‌ని తెలిపారు.

ttddevoters3

ఈ సమాచారం ధ్రువీకరించుకోకుండా కొందరు భక్తులు కాల్‌ సెంటర్లకు ఫోన్లు చేసి, అధికారులకు మెయిళ్లు పంపుతున్నార‌ని, భక్తులు తమ బ్యాంక్‌ స్టేట్‌మెంట్లను పరిశీలించుకుని కాషన్‌ డిపాజిట్‌ మొత్తం రీఫండ్‌ కాకపోతేనే సంప్రదించాలని కోరారు. మ‌రికొందరు టీటీడీ నిబంధనల ప్రకారం గది ఖాళీ చేయడం లేదని, వెరిఫికేషన్‌ కోడ్‌ సబ్‌మిట్‌ చేయకపోవడం, ఫొటో సరిపోలకపోవడంతో రీఫండ్‌ జనరేట్‌ కావడం లేదని చెప్పారు.

ఎస్ఎంఎస్‌ ద్వారా పేలింక్‌ : సిఆర్ఓలో లక్కీడిప్‌ ద్వారా ఆర్జిత సేవా టికెట్లు పొందిన భక్తులకు జూలై 19వ తేదీ నుండి ప్రయోగాత్మకంగా ఎస్ఎంఎస్‌ ద్వారా పేలింక్‌ పంపుతున్నామని ఈవో ధర్మారెడ్డి గుర్తు చేసారు. భక్తులు తిరిగి కౌంటరు వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నెట్‌ బ్యాంకింగ్‌ లేదా యుపిఐ లేదా క్రెడిట్‌ కార్డు లేదా డెబిట్‌ కార్డు ద్వారా ఆన్లైన్‌లో సొమ్ము చెల్లించి సేవా టికెట్లు ప్రింట్‌ తీసుకోవచ్చన్నారు.

త్వరలో ఎంబీసీ-34 కౌంటర్‌ వద్ద విచక్షణ కోటాలో కేటాయించే ఆర్జిత సేవా టికెట్లు, బ్రేక్‌ దర్శన టికెట్లకు కూడా ఈ విధానం అమలుచేస్తామని ఈవో వెల్లడించారు. ఆగస్టు 27 నుంచి 29వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరుగనున్నాయని చెప్పారు. నెల రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదన్నారు. శ్రీవారి భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు వీలుగా పుష్కరిణి పైభాగంలో షవర్లు ఏర్పాటు చేసామని.. భక్తులు వీటిని వినియోగించుకోవాలని కోరారు.

eodharmareddy

క్యాన్సర్‌ రహితప్రాంతంగా : తిరుపతి జిల్లాను క్యాన్సర్‌ రహితప్రాంతంగా తయారు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామూహిక క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ కార్యక్రమానికి టీటీడీ సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. దీంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు క్యాన్సర్‌ పరీక్షలు ఉచితంగా నిర్వహించడం కోసం ఒక పింక్‌ బస్సును ఆధునిక వైద్య‌ప‌రిక‌రాల‌తో జిల్లా యంత్రాంగానికి విరాళంగా అందిస్తామని చెప్పారు.

స్విమ్స్‌లో త్వరలో లివర్‌ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. టీటీడీ విద్యా విభాగం ఆధ్వర్యంలో తిరుమల ఘాట్‌ రోడ్లు, నడకమార్గాల్లో ఆగస్టు 12వ తేదీన శుద్ధ తిరుమల-సుందర తిరుమల కార్యక్రమం నిర్వహిస్తామని ఈవో వెల్లడించారు. జూలై నెలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య - 23.23 లక్షలు కాగా, హుండీ కానుకలు - రూ.129.08 కోట్లుగా ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+