TTD: తిరుమల నడక దారి భక్తులకు ఈవో కీలక సూచనలు, పలు నిర్ణయాలు..!!

Tirumala: తిరుమల అలిపిరి నడక మార్గంలో వచ్చే భక్తులకు ఈవో ధర్మారెడ్డి కీలక సూచనలు చేసారు. తాజాగా నడకమార్గంలో వస్తున్న మార్గంలో 7వ మైలు వద్ద బాలుడి పైన చిరుత దాడి సంచలనంగా మారింది. గాయపడిన బాలుడిని ఛైర్మన్ సుబ్బారెడ్డి..ఈవో ధర్మారెడ్డి పరామర్శించారు. అదే సమయంలో దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. బాలుడికి ప్రాణాపాయం తప్పిందన్నారు. తీసుకోవాల్సిన చర్యల పైన అధికారులతో సమీక్షించారు. పలు నిర్ణయాలు ప్రకటించారు.

నడక మార్గంలో చిరుతపులి : గురువారం తిరుమల అలిపిరి నడక మార్గంలో చిరుతపులి ప్రత్యక్షమైంది. ఏడవ మైలు దగ్గర చిరుత బాలుడిపై దాడి చేసింది..అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లింది. వెంటనే అలెర్టైన బాలుడి తాత, అక్కడి యాత్రికులు కేకలు వేస్తూ అటవీ ప్రాంతంలో చిరుతను వెంటాడారు. చిరుత అటవీ ప్రాంతంలో దాదాపు 150 మీటర్ల దూరంలో బాలుడిని వదిలి వెళ్లింది..చిరుత దాడిలో బాలుడి తలకు, గుండె భాగంలో తీవ్రంగా గాయాలు అయ్యాయి.

eodharmareddy

దీనీ పైన ఈవో స్పందించారు. దాడి చేసింది పిల్లచిరుత కావడంతో బాలుడికి ప్రాణాపాయం తప్పిందన్నారు. దాడి జరిగిన సమయంలో భక్తులు పెద్దగా అరవడం, రిపీటర్ స్టేషన్ నుంచి లైట్లు వేయడంతో చిరుత బాలుడిని వదిలి వెళ్లిపోయిందన్నారు. నడక మార్గంలో టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది.

భక్తులకు తాజా సూచనలు : టీటీడీ అటవీ శాఖ అధికారులు చిరుత సంచారాన్ని గుర్తించారని, అలిపిరి గాలిగోపురం నుంచి నరసింహస్వామి గుడి వరకు చిరుత సంచరిస్తున్నట్టుగా తెలుస్తోందని చెప్పారు. ఈ కారణంగా రాత్రి 7 గంటల తరువాత అలిపిరి నడక మార్గంలో గాలిగోపురం నుండి 200 మంది భక్తులను ఒక బృందంగా కలిపి పంపేలా ఏర్పాట్లు చేశామన్నారు. వీరితోపాటు సెక్యూరిటీ గార్డ్ ఉంటారని, భక్తులు గోవింద నామస్మరణ చేసుకుంటూ ముందుకు సాగుతారని చెప్పారు.

చిన్నపిల్లలను బృందం మధ్యలో ఉంచుకుని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిరుతను పట్టుకునేందుకు ఏర్పాట్లు చేశామని, ఇందుకోసం కెమెరా ట్రాప్స్ కూడా సిద్ధం చేశారని ఈవో చెప్పారు. శ్రీవారి మెట్టు మార్గంలో సాయంత్రం 6 గంటల వరకు, అలిపిరి మార్గంలో రాత్రి 10 గంటల వరకు భక్తులను అనుమతిస్తారని తెలిపారు.

చర్యల దిశగా టీటీడీ : సాయంత్రం 6 గంటల తర్వాత ఘాట్ రోడ్లలో వెళ్లే ద్విచక్ర వాహనదారుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై ఆలోచిస్తున్నట్టు చెప్పారు. చిన్నారి కౌశిక్‌కు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరామర్శించారు. బాలుడి ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

ttdwalkway-

శ్రీ వేంకటేశ్వర స్వామి దయ వల్లనే చిరుత పులి బారి నుంచి ప్రాణాలతో బయటపడ్డా బాలుడు కౌశిక్ మెల్లిగా కోలుకుంటున్నారన్నారు. మెట్ల మార్గంలో నడిచి వెళ్తున్న భక్తులు గుంపులు, గుంపులుగా వెళ్లాలని మైక్‌ల ద్వారా విజిలెన్స్ అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు. అలిపిరి నడక మార్గంలో చిరుత సంచారం పై భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మెట్ల మార్గంలో జంతువులు తిరిగే చోట ఫెన్సింగ్ ఏర్పాటుకు చర్యలు చేపడతామని అధికారులు చెబుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+