తిరుపతిలో TTD ఊహించని స్పెషల్ ఏర్పాట్లు.. భక్తులకు తిప్పలు ఉండవు
తిరుమల శ్రీవారి ఆలయంలో నేడు సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆరంభం కానున్నాయి. ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ ఉత్సవాల నేపథ్యంలో తిరుమల సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. విద్యుద్దీప కాంతులతో వెలిగిపోతోంది. నారాయణుడి నామస్మరణతో పులకించిపోతోంది. అశేష భక్తజనావళికి ఓ దివ్యానుభూతిని పంచుతోంది. తిరుమల అన్ని రోడ్లు, కూడళలో పూలతో చేసిన స్వామివారి నిలువెత్తు కటౌట్లను అమర్చారు.
ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి టీటీడ.. ప్రత్యేక చర్యలు చేపట్టింది. తిరుపతిలో వాహనాలు ఎక్కడికక్కడ స్తంభించిపోకుండా ఉండటానికి విస్తృత ఏర్పాట్లు చేసింది. తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో పార్కింగ్, హోల్డింగ్ పాయింట్లు, అన్నప్రసాదం, తాగునీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి సౌకర్యాలు, ప్రజా రవాణా వంటి సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. భక్తుల రద్దీ, పరిస్థితులకు అనుగుణంగా తక్షణ నిర్ణయాలు తీసుకునేలా కార్యాచరణ రూపొందించించింది.

తిరుపతి దేవలోక్, భారతీ విద్యా భవన్, అలిపిరి చెక్‌పాయింట్ వద్ద పార్కింగ్, హోల్డింగ్ పాయింట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని కొద్దిసేపటి కిందటే టీటీడీ కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర తనిఖీ చేశారు. అక్కడి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. వారికి తుది ఆదేశాలను ఇచ్చారు. జిల్లా యంత్రాంగం, టీటీడీ, పోలీసు, మున్సిపల్, రవాణా, ఆరోగ్య తదితర శాఖలతో ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేశామని, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా తక్షణమే తమ దృష్టికి తీసుకుని రావాలని సూచించారు. ఈ టీమ్ లన్నీ కూడా తిరుమల కమాండ్ కంట్రోల్ సిస్టమ్ తో అనుసంధానమై ఉంటాయని వివరించారు.
తిరుమలలో ఉన్న పరిమితుల నేపథ్యంలో తిరుపతిలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ సదుపాయాలు కల్పించామని ముద్దాడ రవిచంద్ర వివరించారు. అక్కడి నుంచి భక్తుల రవాణాకు ఏపీఎస్ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. క్రౌడ్ మేనేజ్మెంట్లో భాగంగా రైల్వే స్టేషన్, బస్టాండ్, అలిపిరి, శ్రీవారిమెట్టు తదితర కీలక ప్రాంతాలను తిరుపతి కమాండ్ కంట్రోల్ ద్వారా కెమెరాలు, డ్రోన్లతో నిరంతరం పర్యవేక్షించనున్నామని అన్నారు.
తిరుమలలో ఔటర్, ఇన్నర్ రింగ్ రోడ్లను సమర్థవంతంగా వినియోగించడంతో పాటు సుమారు 3,000 కెమెరాల ద్వారా భక్తుల రద్దీ, భద్రతను పర్యవేక్షించనున్నట్లు వివరించారు. అలిపిరి టోల్గేట్, అలిపిరి, శ్రీవారిమెట్టు నడక మార్గాల్లో భద్రత, స్క్రీనింగ్‌ను మరింత పటిష్టం చేసిన్నట్లు రవిచంద్ర తెలిపారు. అలిపిరిలో ఏర్పాటు చేసిన ఏఎన్పీఆర్, ఎఫ్ఆర్ఎస్ కెమెరాలను తిరుమల ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేశామని, డేటాబేస్‌లోని సుమారు 1,500 మంది నేరస్థులను గుర్తించేలా ఈ వ్యవస్థ ఉందని అన్నారు.














Click it and Unblock the Notifications
