Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

TTD: టీటీడీ మెడకు కల్తీ నెయ్యి వివాదం? మరో ఆరుగురికి సిట్ షాక్..!

ఏపీలో గత వైసీపీ హయాంలో చోటు చేసుకున్న తిరుమల కల్తీ నెయ్యి వివాదం క్రమంగా టీటీడీ (TTD)మెడకు చుట్టుకుంటోంది. గతంలో టీటీడీ పాలకమండలిని నడిపిన వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి వంటి వారు ఈ వివాదంలో అధికారుల పాత్ర ఉందని, తమకేం సంబంధం లేదని చెప్పారు. ఇప్పుడు సిట్ కూడా అదే కారణంతో ఉద్యోగులనే టార్గెట్ చేస్తోంది. సిట్ దర్యాప్తులో కల్తీ నెయ్యి వాడేందుకు సహకరించిన న 9 మంది టీటీడీ ఉద్యోగులపై అభియోగాలు మోపిన సిట్.. ఇప్పుడు మరో ఆరుగురికి షాకిచ్చింది.

తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యి కల్తీలో ఆరుగురు ఉద్యోగులకు ప్రమేయం ఉందని సిట్ తేల్చింది. గతంలో అభియోగాలు మోపిన 9 మంది ఉద్యోగులతో పోలిస్తే వీరిపై అంత పెద్ద ఆరోపణలు లేకపోవడంతో శాఖాపరమైన దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని సిట్ సూచించింది. ఈ మేరకు టీటీడీకి తాజాగా సిట్ లేఖ రాసినట్లు తెలుస్తోంది. దీంతో టీటీడీ ఇప్పుడు ఆరుగురు సొంత ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్దమవుతోంది.

TTD Ghee Adulteration Scam 6 Employees Face Departmental Action After SIT Probe

కల్తీ నెయ్యి వివాదంలో పాత్ర ఉందని సిట్ గుర్తించిన వారిలో టీటీడీ డిప్యూటీ ఈవో పద్మావతితో పాటు వీఎస్ సురేశ్ కుమార్, జ్యోతీశ్వరుడు, పార్ధసారధి, భోపాలన్ మురళి, వెంకటరమణ వంటి వారు ఉన్నారు. నెయ్యి కొనుగోళ్లు, గోడౌన్లలో విధులు నిర్వర్తించిన సమయంలో వీరు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడి కల్తీకి సహకరించారని సిట్ గుర్తించింది. దీంతో వీరిపై శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో టీటీడీ వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతోందన్నది ఉత్కంఠగా మారింది. మరోవైపు సిట్ లేఖల నేపథ్యంలో టీటీడీ అధికారులు, ఉద్యోగుల్లో అలజడి కొనసాగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+