TTD: తిరుమల భక్తులకు శుభవార్త: లక్కీడిప్ డేట్స్ ఇవే; దర్శనానికి, సేవలకు, గదులకు త్వరపడండి!!
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. జులై నెల కోటాకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ లను ఈ నెల 18న టీటీడీ విడుదల చెయ్యనుంది. ఇక ఈ ఆర్జిత సేవా టికెట్లను 18వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచనుంది.
శ్రీవారి సేవా టికెట్ల లక్కీ డిప్ ఆ రోజే
ఈ సేవ టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీ డిప్ లో టికెట్లను కేటాయించనుంది టిటిడి. ఇక ఈ టికెట్లను పొందిన వారు డబ్బులు చెల్లించి టికెట్ ను కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఏప్రిల్ 22న స్వామి కళ్యాణోత్సవంతో పాటు, ప్రత్యేక సేవల కోటా
అంతేకాక కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ల కోటాను ఏప్రిల్ 22వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేయనుంది. ఇక 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్ లకు సంబంధించిన టికెట్లను విడుదల చేస్తారు.
23న అంగ ప్రదిక్షణం టోకెన్ల కోటా, 24న గదుల కోటా
23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగ ప్రదిక్షణం టోకెన్ల కోటా, 11 గంటలకు శ్రీ వాణి ట్రస్ట్ టికెట్ లకు విడుదల చేయనున్నారు.అంతేకాదు ఈనెల 24వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల, తిరుపతిలో గదుల కోటను ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నారు.
దివ్యాంగుల కోటా అప్పుడే.. ఏప్రిల్ 24న 300 రూపాయల టికెట్ల కోటా
తిరుమల శ్రీవారిని వయోవృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, దివ్యాంగులు దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.
శ్రీవారి సేవా కోటా ఏప్రిల్ 27న
ఇక శ్రీవారి సేవ కోటాను 27న ఉదయం 11 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ, ఒంటిగంటకు పరకామణి సేవ కోటాను ఆన్లైన్లో విడుదల చేయనున్నారు టిటిడి అధికారులు. ఇక తేదీలను దృష్టిలో పెట్టుకుని టికెట్లను ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాలని టీటీడీ సూచిస్తుంది.












Click it and Unblock the Notifications