టీటీడీ అదిరిపోయే ఆఫర్.. తేదీలు కూడా ప్రకటించింది, త్వరపడండి

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల పైన కొలువుతీరిన వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన విశేషాలను ఎప్పటికీ అప్పుడు అందించే టీటీడీ తాజాగా ఒక కొత్త అప్డేట్ ను అందించింది. ఆగస్టు 4, 5వ తేదీలలో మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి అని ఒక అద్భుతమైన ప్రకటన చేసింది. టీటీడీ స్వామివారికి సమర్పించిన మొబైల్స్ దక్కించుకునే అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది.

మొబైల్ ఫోన్లు ఆన్ లైన్ వేలం
తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన ఉపయోగించినవి , పాక్షికంగా దెబ్బతిన్న 73 లాట్ల మొబైల్ ఫోన్లను ఆగష్టు 04వ తేదీ నుండి 05వ తేదీ వరకు టిటిడిలో ఆన్ లైన్ ద్వారా ఈ వేలం వేయనుందని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.

TTD has announced an amazing offer announced dates too for mobiles e auction hurry up

Take a Poll

ఈ కంపెనీల ఫోన్లు వేలం
వీటిలో కార్భన్, ఎల్ వై ఎఫ్, నోకియా, శాంసంగ్, లావా, ఐటెల్, లెనోవా, ఫిలిప్స్, ఎల్.జి.సాంసుయ్, ఒప్పో, పోకో, ఏసర్, పానా సోనిక్, హానర్, వన్ ప్లస్, బ్లాక్ బెర్రీ జియోనీ, మైక్రో సాఫ్ట్ , ఆసస్ , కూల్ పాడ్, హెచ్.టి.సి, మోటోరోలా, టెక్నో, ఇంఫినిక్స్, రియల్ మీ, హువాయ్, సెల్కన్, వినో, మైక్రో మాక్స్ మరియు ఇతర మొబైల్ ఫోన్లు వంటి కంపెనీల ఫోన్లు ఉన్నాయని తెలిపింది.

వేలానికి రిజిస్టర్ అయిన బిడ్డర్లు మాత్రమే అర్హులు
EA ID Nos. 25180, 25181, 25182, 25183 ఆన్ లైన్ లో ఈ వేలం వేయనున్నారు. ఆసక్తి కల్గిన బిడ్డర్లు ఈ వేలం పాటలో పాల్గొనవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈ - కొనుగోలు పోర్టల్ లో రిజిస్టర్ అయిన బిడ్డర్లు మాత్రమే వేలంలో పాల్గొనడానికి అర్హులు. ఇతర వివరాలకు స్థానిక జనరల్ మేనేజర్ ( వేలములు) / ఏఈవో ( వేలములు), టిటిడి, హరేకృష్ణ మార్గ్, తిరుపతిలో https://konugolu.ap.gov.in లేదా టిటిడి వెబ్ సైట్ www.tirumala.org లేదా 0877 - 2264429 ఫోన్ నెంబర్ ద్వారా గాని సంప్రదించగలరు అన్ని టీటీడీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

తిరుమలలో ఘనంగా గరుడ పంచమి వేడుకలు
ఇదిలా ఉంటే జూలై 29వ తేదీన తిరుమలలో గరుడ పంచమి వేడుకలను ఘనంగా జరపడానికి టిటిడి నిర్ణయించింది ఈ సందర్భంగా ఆరోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామి శ్రీవారు ఏడు గంటల నుండి 9 గంటల వరకు తనకు ఇష్టమైన గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తాడు.

జులైలో రెండోసారి గరుడ వాహనంపై స్వామివారు
ఈ నెలలో స్వామివారు రెండోసారి గరుడ వాహనం పైన దర్శనం ఇవ్వనున్నారు. ప్రతి ఏడాది తిరుమలలో గరుడ పంచమి ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందంగా ఉండేందుకు, సంతానం బలశాలి గా, మంచి వ్యక్తిత్వం కలవాడుగా ఉండేందుకు గరుడ పంచమి పూజ చేస్తారని చెబుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+