40 రోజులు పుష్కరిణి మూసివేత- TTD ప్రకటన, అసలు కారణం..!!
TTD కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా నిత్యం తిరుమల వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. ఈ ఏడాది రెండు సార్లు శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. అందులో భాగంగా ముందస్తు చర్యలు చేపట్టింది. తిరుమలలో 40 రోజుల పాటు పుష్కరిణి మూసివేత పైన టీటీడీ ప్రకటన చేసింది. భక్తులకు కీలక సూచనలు అందించింది.
ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు తిరుమలలో స్వామి వారి పుష్కరిణిలోకి భక్తులను అనుమతించరని టీటీడీ వెల్లడించింది. తిరుమల శ్రీవారి ఆలయం పక్కన గల పవిత్రమైన స్వామి పుష్కరిణి మరమ్మతు పనులు ఆగస్టు 01 నుండి 31వ తేదీ వరకు నిర్వహించనున్నారు. శ్రీవారి సాకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రతి ఏడాది పుష్కరిణి మరమ్మతులు నిర్వహిస్తారు.
ఈ ఏడాది సెప్టెంబరు 15 నుండి శ్రీవారి బ్రహ్మూత్సవాలు జరగనున్న నేపథ్యంలో టీటీడీ వాటర్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ పనులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. భారీ వర్షాలు, తుఫాన్లు, ఇతర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ముందుస్తు జాగ్రత్తలో భాగంగా సెప్టెంబర్ 01 నుండి 10 వ తేది వరకు పుష్కరిణి మూసివేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో, ఈ 40 రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదు.

భక్తులకు టీటీడీ సూచనలు
అదే విధంగా భక్తులను పుష్కరిణిలోకి అనుమతించరు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సహక రించాల్సిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కాగా..ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల్లో మరింత భక్తి భావాన్ని పెంపొందించేలా ఎస్వీ వేంకటేశ్వర భక్తి ఛానల్ కార్యక్రమాలను సృజనాత్మకంగా, నాణ్యంగా రూపొందించాలని టిటిడి ఈవో ముద్దాడ రవిచంద్ర అధికారులను ఆదేశించారు. తిరుమల ఆధ్యాత్మిక వైభవం, శ్రీవారి మహిమను ప్రతి భక్తుడి హృదయానికి చేరేలా ఆకర్షణీయమైన కార్యక్రమాలను రూపొందించాలని చెప్పారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. భక్తి, భావం, సరళత కలగలిపిన కార్యక్రమాలతో రోజురోజుకు ప్రేక్షకాదరణ పెరిగేలా కొత్త ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. భక్తుల అభిరుచికి అనుగుణంగా మరిన్ని వినూత్నమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications