TTD: నడిచి దర్శనంకు వచ్చే భక్తులకు అలర్ట్ - టీటీడీ కీలక మార్పులు..!!
Tirumala: తిరుమలకు నడిచి వెళ్లే భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది. నడకదారి మార్గంలో నిత్యం వేలాది మంది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తారు. తాజాగా టీటీడీ ఈ మార్గంలో కొన్ని కీలక నిర్ణయా లను అమలు చేస్తోంది. తిరుమల- తిరుపతి పరిధిలో చిరుతల సంచారంతో కొన్ని ఆంక్షలు విధించింది. భద్రతా పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. రెండు రోజుల క్రితం అలిపిరి-తిరుమల నడక మార్గంలోని ఏడో మైలు దగ్గర చిరుత సంచారంతో టీటీడీ విజిలెన్స్ విభాగం అప్రమత్తం అయింది. చిరుతను పట్టుకొనేం దుకు ప్రయత్నాలు చేస్తూనే భక్తులకు అలర్ట్ చేస్తున్నారు.
టీటీడీ అప్రమత్తం
తిరుమలలో చిరుతల కదలికలు గుర్తించారు. చిరుతల సంచారంతో టీటీడీ విజిలెన్స్, అటవీ శాఖ అధికారు లు అప్రమత్తం అయ్యారు. నడక దారి మార్గంలో భక్తుల రాకపోకల పైన ఆంక్షలను విధించారు. భద్రతను మరింత కట్టుదిట్టం చేసారు. అలిపిరి వద్ద నుంచి తిరుమలకు నడక మార్గాన వెళ్లే భక్తులను ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు యథావిధిగా అనుమతిస్తున్నారు. అనంతరం గుంపులు గుంపులుగా పంపిస్తున్నారు. ఒక్కో బృందంలో 70 నుంచి 100 మంది భక్తులు ఉండేలా విజిలెన్స్ సిబ్బం ది పర్యవేక్షిస్తున్నారు.

భద్రతా చర్యలు
12 సంవత్సరాల లోపు ఉన్న చిన్నారులను మధ్యాహ్నం నుంచి అనుమతించడం లేదు. రాత్రి 9.30 గంటల తరువాత అలిపిరి నడక మార్గాన్ని మూసివేస్తున్నారు. గతంలో చిరుత దాడిలో ఒక చిన్నారి ప్రాణం కోల్పోయింది. అంతకు ముందు మరో చిన్నారి తీవ్రంగా గాయ పడ్డాడు. దీంతో, చిన్నారుల అనుమతి విష యంలో ప్రత్యేకంగా సూచనలు చేస్తున్నారు. రాత్రి సమయంలో పూర్తిగా నడక మార్గాన్ని మూసివేస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కెమేరాల ద్వారా చిరుతల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నారు. ఇదే సమయంలో అటవీ శాఖ సిబ్బంది చిరుతల కదలికల ఆధారంగా పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ముందుగా భక్తులకు ఎలాంటి సమస్య రాకుండా అవసరమైన చర్యల పైన ఫోకస్ చేసారు.
భక్తులకు సూచన
టీటీడీ అధికారులు సైతం భక్తులకు కీలక సూచనలు చేసారు. శ్రీవారి దర్శనానికి టోకెన్లు, టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లలోకి ప్రవేశించాల్సిందిగా టిటిడి విజ్ఞప్తి చేసింది. ఇదే విషయాన్ని పలుమార్లు ప్రచార, ప్రసార మాధ్యమాల ద్వారా భక్తులకు తెలియజేశాం. అయినప్పటికీ ఇటీవల కొంత మం ది భక్తులు తమకు కేటాయించిన సమయానికి ముందే క్యూలైన్ల వద్దకు వెళ్లి క్యూలైన్లలోకి అనుమతించాలని సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్న అంశాన్ని టీటీడీ గుర్తించింది. మరి కొంత మంది సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయటం సరైన విధానం కాదని పేర్కొంది. భక్తులకు తిరుమలలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని టీటీడీ స్పష్టం చేసింది.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్












Click it and Unblock the Notifications