శ్రీవారి భక్తుల కోసం టీటీడీ విస్తృత చర్యలు: తిరుమలలో ఏరియల్ వాక్‌వే
Tirumala: తిరుమల శేషాచలం అడవుల్లో చిరుతలు, ఇతర వణ్య ప్రాణుల సంఖ్య భారీగా పెరిగింది. గత ఏడాది ఆగస్టులో చిరుతల సంచారం శ్రీవారి భక్తులను భయాందోళనలకు గురి చేసింది. అలిపిరి పరిసర ప్రాంతాల్లో చిరుతలు కనిపించాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ విభాగం సీసీటీవీ కెమెరాల ద్వారా వాటి సంచారాన్ని గుర్తించింది.
వాటి కదలికలను తీవ్రమైన నేపథ్యంలో- టీటీడీ విస్తృత చర్యలు తీసుకుంది. కాలినడకన తిరుమలకు వచ్చే భక్తులను వన్యప్రాణుల నుంచి రక్షణ కల్పించడానికి అవసరమైన సిఫారసులను స్వీకరించడానికి టీటీడీ ఇదివరకే ఓ జాయింట్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వైల్డ్‌లైఫ్), ఏపీ చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ సారథ్యంలో ఈ కమిటీ ఏర్పాటైంది.

క్షేత్రస్థాయిలో పర్యటించిన ఈ కమిటీ ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది. నడక మార్గంలో భక్తుల రక్షణ కోసం తీసుకోవాల్సిన స్వల్ప, దీర్ఘకాలిక చర్యలతో కూడిన సిఫారసులను టీటీడీకి అందజేసింది. కమిటీ ఇచ్చిన నివేదికపై టీటీడీ కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి సమీక్ష నిర్వహించారు.
టీటీడీ, ప్రభుత్వ అటవీ శాఖ ఇప్పటివరకు తీసుకున్న స్వల్పకాలిక చర్యల గురించి ధర్మారెడ్డి వివరించారు. భక్తులకు రక్షణ కల్పించడానికి తక్షణ చర్యల కింద స్వల్పకాలిక సిఫారసులను కొనసాగించాలని కమిటీ సూచించినట్టు తెలిపారు. అడవి జంతువుల పర్యవేక్షణ, దానికి కావాల్సిన భవన సదుపాయం, సిబ్బంది, వ్యూ లైన్ల ఏర్పాటు, బయోఫెన్సింగ్, ఏరియల్ వాక్ వే, అండర్‌పాస్, ఓవర్ హెడ్ పాస్‌ల కోసం స్థలం ఎంపిక, ఇతర మౌలిక వసతుల కల్పన.. దీర్ఘకాలిక చర్యల కిందికి వస్తుందని అన్నారు.
ఏరియల్ వాక్‌వే, అండర్‌పాస్, ఓవర్ హెడ్ పాస్ నిర్మాణానికి అవసరమైన డిజైన్లను రూపొందించాలని డెహ్రాడూన్‌లోని వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు విజ్ఞప్తి చేశామని ధర్మారెడ్డి తెలిపారు. ఏడో మైలు నుంచి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం వరకు నడకదారికి ఇరువైపులా లైటింగ్ వసతి కల్పించాలని, మానిటరింగ్ సెల్ కోసం భవనాన్ని నిర్మించాలని జిల్లా అటవీశాఖ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
-
రాములవారి సేవలో శ్రీవారి సేవకులు, అరుదైన ఘట్టం - కన్నుల పండువగా..!! -
రూ.300 టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శనం- భక్తుల కోసం టీటీడీ కొత్త విధానం...!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
పాలకోసం ఏడుస్తుందని పసిదాన్ని చంపేసిన తల్లి.. తిరుపతి జిల్లాలో దారుణం -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!












Click it and Unblock the Notifications