Tirumala: టీటీడీ మరో కొత్త రికార్డు - ఏడాది కాలంలోనే..!!
తిరుమల ఆదాయంలో మరో కొత్త రికార్డు నమోదైంది. టీటీడీ హుండీకి కాసుల వర్షం కురుస్తోంది. నిన్న (శుక్రవారం)తో ముగిసిన 2022-23 ఆర్దిక సంవత్సరం వార్షిక ఆదాయం 1,520.29 కోట్లుగా అధికారులు తేల్చారు. గత ఏడాది ప్రతీ నెలా శ్రీవారి హుండీ ఆదాయం రూ 100 కోట్ల పైగానే ఉంది. మార్చి నెలలో తిరుమల హుండీ ఆదాయం రూ. 120.29 కోట్లు లభించింది. నేటి నుంచి ప్రారంభమైన ఆర్దిక సంవత్సరానికి టీడీపీ పాలక మండలి రూ 4,411.68 కోట్ల అంచనాలతో బడ్జెట్ ఆమోదింది. దేశంలో మేరే దేవాలయానికి లేని విధంగా ఈ బడ్జెట్ తో కొత్త రికార్డులు నమోదువుతున్నాయి.
ఏడాది కాలంగా తిరుమల హుండీ ఆదాయం గణనీయంగా పెరిగింది. కానుకల ద్వారా భారీగా ఆదాయం సమకూరుతోంది. మార్చి నెలలో రూ 120.29 కోట్ల మేర హుండీ ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. గత కొన్ని నెలలుగా శ్రీవారి దర్శనానికి తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు.
ఈ క్రమంలో భారీగా నగదు, ఇతర విలువైన వస్తువులను శ్రీవారికి సమర్పిస్తున్నారు. దీంతో ప్రతీ నెలా శ్రీవారి ఆదాయం పెరుగుతోంది. 2022 సంవత్సరంలో అంటే జనవరి నెల నుంచి డిసెంబర్ నెల వరకు 2.37 కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ 1,450 కోట్లు సమకూరిందని టీటీడీ అధికారులు తెలిపారు.

2021 (జనవరి నుంచి డిసెంబర్ నెల వరకు) సంవత్సరంలో 1.04 కోట్ల మంది భక్తులు దర్శించుకోగా రూ. 833.41 కోట్లు ఆదాయం సమకూరింది. అత్యధికంగా గతేడాది ఆగస్టు నెలలో 140.34 కోట్ల ఆదాయం వచ్చినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ రోజు నుంచి తిరుమలకు కాలినడకన వచ్చే భక్తుల కోసం దివ్య దర్శనం టోకెన్లు అందిస్తున్నారు.
అలిపిరి వద్ద పది వేల టోకెన్లు, శ్రీవారిమెట్టు మార్గంలో అయిదు వేల టోకెన్లు అందిస్తున్నారు. వారం రోజుల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేసిన తరువాత అవరమైన మార్పులతో ఈ విధనం కొనసాగింపు పైన టీటీడీ నిర్ణయం తీసుకోనుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం, సేవల టికెట్లు లేని భక్తులకు మాత్రమే ఈ దివ్య దర్శనం టోకెన్లు అందించనున్నారు.












Click it and Unblock the Notifications