TTD: నేడే శ్రీవారికి గరుడసేవ, భారీగా భక్తులు - టీటీడీ తాజా నిర్ణయాలు..!!
Tirumala: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు(Brahmotsavam) వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో ప్రధానమైన గరుడ సేవ(Garuda Seva) కు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. దీంతో టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. గరుడ సేవ నాడు సర్కారు హారతి మాత్రమే ఉంటుందని టీటీడీ(TTD) ప్రకటించింది. గరుడ వాహనాన్ని రాత్రి 7 గంటలకు ప్రారంభించి భక్తులందరూ దర్శించుకునేలా అర్ధరాత్రి 2 గంటల వరకైనా నెమ్మదిగా ముందుకు కదిలేలా ప్రణాళిక రూపొందించారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు (శుక్రవారం) రాత్రి జరగనున్న గరుడ సేవ నాడు సర్కారు హారతి మాత్రమే ఉంటుంది. ఇతర హారతులు అనుమతింమని టీటీడీ స్పష్టం చేసింది. దాదాపు 2 లక్షల మంది భక్తులు గ్యాలరీల్లో వేచి ఉండే అవకాశముందని అంచనా వేస్తున్నారు. గరుడ సేవ దర్శనం కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్లలో వేచి ఉండే భక్తులను సుపథం, సౌత్ వెస్ట్ కార్నర్, గోవిందనిలయం నార్త్ వెస్ట్ గేట్, నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా గ్యాలరీల్లోకి అనుమతించేలా అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. గరుడ వాహనాన్ని(Garuda Vahanam) రాత్రి 7 గంటలకు ప్రారంభించి భక్తులందరూ(Tirumala) దర్శించుకునేలా అర్ధరాత్రి 2 గంటల వరకైనా నెమ్మదిగా ముందుకు కదిలేలా ప్రణాళిక రూపొందించారు.

గరుడసేవ దర్శనం(Gardua Seva Darshanam) కోసం బయట వేచి ఉండే భక్తులు తమవంతు వచ్చే వరకు సంయమనంతో వేచి ఉండి భద్రతా విభాగం నిబంధనలు పాటించాలని అధికారులు కోరుతున్నారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 8 నుండి రాత్రి 1 గంట వరకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందించనున్నారు. గ్యాలరీల్లోనూ ఉదయం నుండి రాత్రి వరకు పులిహోర, టమోటా బాత్, బిసిబెళాబాత్ తదితర అన్నప్రసాదాల ప్యాకెట్లు పంపిణీ చేస్తారు. భక్తుల కోసం 2.50 లక్షల మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేశారు. ఆలయ నాలుగు మాడవీధుల్లో పరిశుభ్రత, కాటేజీలు, యాత్రికుల వసతి సముదాయాల వద్ద మెరుగైన పారిశుద్ధ్యం కోసం బ్రహ్మోత్సవాల రోజుల్లో అదనంగా 247 మంది, గరుడసేవ నాడు అదనంగా మరో 774 మందిని ఏర్పాటు చేశారు.
భక్తుల కోసం నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీల్లో 524 తాగునీటి డ్రమ్ములను ఏర్పాటుచేసి శ్రీవారి సేవకుల(Sri Vari Sevaks) ద్వారా అందించేందుకు ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాలకు దాదాపు 1130 మంది టీటీడీ నిఘా మరియు భద్రతా సిబ్బందితోపాటు 3,600 మంది పోలీసులతో పటిష్టంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. గరుడసేవకు ప్రత్యేకంగా 1200 మంది పోలీసులతో అదనపు భద్రత (Police security) కల్పించారు. ఆలయ మాడ వీధులు, ఇతర ప్రాంతాల్లో 2,770 సిసి కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి పర్యవేక్షిస్తారు. ఘాట్ రోడ్లలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని గురువారం సాయంత్రం 6 గంటల నుండి సెప్టెంబరు 23వ తేదీ శనివారం ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలను టీటీడీ (TTD) రద్దు చేసింది. గరుడసేవ నాడు వాహనసేవను తిలకించేందుకు మాడ వీధులు, భక్తుల రద్దీ ఉండే ప్రాంతాల్లో కలిపి 20 పెద్ద డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications