తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా..? దర్శనాలపై టీటీడీ బిగ్ డెసిషన్..!!
TTD: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఈ వారంతో విద్యా సంస్థలకు వేసవి సెలవు లు ప్రారంభం కానున్నాయి. దీంతో.. మే ప్రారంభం నుంచే రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. ఇందుకు అనుగుణంగా కీలక నిర్ణయాల అమలుకు సిద్దం అవుతోంది. ఇదే సమయంలో భక్తులకు వేసవి వేళ ఇబ్బందులు లేకుండా సదుపాయాలు కల్పిస్తోంది. వేసవి లో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా కొత్త కార్యాచరణ ఖరారు చేస్తోంది.
వేసవిలో ప్రతీ ఏటా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో.. భక్తుల రద్దీకి అనుగుణంగా టీడీడీ చర్యలు చేపడుతోంది. అదే సమయంలో వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో భక్తుల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించింది. ఇదే సమయంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యత దక్కే విధంగా SSD, VIP బ్రేక్ దర్శనాలను రద్దు చేయాలని నిర్ణయించింది. సిఫారసు లేఖల పైన దర్శనాలను మే 1వ తేదీ నుంచి రద్దు చేయనుంది. ఈ మేరకు అధికారికంగా టీటీడీ అధికారులు ప్రకటన చేయనున్నారు. రూ. 300 ప్రత్యేక దర్శనాలు, చంటి పిల్లలు, వయోవృద్ధుల దర్శనా లు, ఆర్జిత సేవా దర్శనాలను యథావిధిగా కొనసాగించనున్నారు. ఎలాంటి టోకెన్లు లేకుండా వచ్చే భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం కల్పించేలా నిర్ణయం తీసుకుంటున్నారు.

సామాన్య భక్తులకు ప్రాధాన్యత
అదే విధంగా తిరుమలకు వచ్చే భక్తుల కోసం వేసవి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇబ్బందులు లేకుండా జర్మన్ షెడ్లు, చలువ పందిళ్లను ఏర్పాటు చేస్తున్నారు. గంగమ్మ ఆలయం నుంచి బాట గంగమ్మ క్యూలైన్ వరకు జిగ్‌జాగ్ లైన్లతోపాటు షెడ్లను ఏర్పాటు చేశారు. ఆలయం నుంచి లడ్డూ విక్రయశాలకు వెళ్లే మార్గంలో గ్రీన్ మ్యాట్‌తో కూడిన పందిళ్లు, కూల్ పెయింట్లు వేశారు. జర్మన్ షెడ్ల వద్ద సేద తీరుతున్న భక్తులకు జల ప్రసాదం అనే పేరుతో క్యాన్ల ద్వారా శ్రీవారి సేవకులు నీటిని అందిస్తున్నారు. కిందటి ఏడాది సైతం దాదాపు రెండున్నార నెలల పాటు సిఫారసు లేఖల ను టీటీడీ రద్దు చేసింది. నేరుగా వీఐపీలు వస్తేనే దర్శనానికి అనుమతించారు. అదే విధంగా క్యూ లైన్ మేనేజ్ మెంట్ సిస్టమ్ అమలు ద్వారా సామాన్య భక్తులకు వేగంగా దర్శనం అందే విధంగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. దీంతో.. వేసవిలో తిరుమలకు వచ్చే భక్తులు తాజా నిర్ణయాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications