దైవ సన్నిధిలో చావూ అదృష్టమే -టీటీడీ మెంబర్ జ్యోతుల నెహ్రూ షాకింగ్..!
తిరుపతి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం వెళ్లి ఆరుగురు మృత్యువాత పడిన ఘటన ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతూనే ఉంది. ఈ ఘటన తర్వాత ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. చివరికి మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించడంతో పాటు ఘటనకు బాధ్యులపై వేటు కూడా వేసింది. అయితే దీంతో ఈ ఘటనను అంతా మర్చిపోతున్నారని భావిస్తున్న తరుణంలో టీటీడీ బోర్డు సభ్యుడైన టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
దైవ సన్నిధిలో అసువులు బాసడం ఒక రకంగా అదృష్టమే అంటూ జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించారు. అయినా ముక్తి కోసం వెళ్లి ప్రాణాలు తీసుకున్న పరిస్ధితి ఉందని ఆయన వెల్లడించారు. తిరుపతి తొక్కిసటాలతో మృత్యువాత పడిన కుటుంబాల ఇళ్లకు వెళ్లి చెక్కులు అందజేసే కార్యక్రమంలో జ్యోతుల నెహ్రూ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో భక్తుల చావును అదృష్టంగా అభివర్ణిస్తూ స్వయంగా టీటీడీ మెంబర్ వ్యాఖ్యానించడం ఏంటన్న చర్చ జరుగుతోంది.

టీటీడీ దేవస్దానం తరఫున మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలియచేస్తున్నామని జ్యోతుల నెహ్రూ తెలిపారు. సీఎం వెంటనే స్పందించి మేం ఏం చేయాలన్న నిర్ణయం తీసుకునేలోపు 25 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చారన్నారు. ఆ కుటుంబంలో చదువుకున్న వారికి అర్హతను బట్టి కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారని తెలిపారు. కుటుంబంలో చదువుతున్న పిల్లలుంటే వారి చదువు బాధ్యత తీసుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.క్షతగాత్రులకు 5 లక్షలు, చిన్న గాయాలైన వారికి 2 లక్షలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. క్షతగాత్రులకు దైవదర్శనం చేయించి బాధ్యతగా ఇళ్లకు పంపించామన్నారు. చంద్రబాబు, పవన్, టీడీడీ అంతా వారికి అండగా ఉంటామని నెహ్రూ తెలిపారు.
దైవ సన్నిధిలో అసువులు బాసడం ఒక రకంగా అదృష్టం.. - జ్యోతుల నెహ్రూ#JyothulaNehru #AndhraPradesh #TirupatiStampede #Tirumala pic.twitter.com/6S5ZQuCa1i
— oneindiatelugu (@oneindiatelugu) January 12, 2025












Click it and Unblock the Notifications