టీటీడీ చైర్మన్‌గా పుట్టా, మెంబర్‌గా రాయపాటికి ఛాన్స్, సభ్యులు వీరే..

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్ నియమితులయ్యారు. టీటీడీ బోర్డు సభ్యులను కూడా ఖరారు చేశారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుంది.

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా రాయపాటి సాంబశివ రావు, ఎమ్మెల్యేలు జీఎస్ఎస్ శివాజీ, బోండా ఉమామహేశ్వర రావు, అనిత, పార్థసారథి, చల్లా రామచంద్రా రెడ్డి, పొట్లూరి రమేష్ బాబు, మాజీ ఎమ్మెల్సీలు రుద్రరాజు పద్మరాజు, మేడా రామకృష్ణా రెడ్డి, డొక్కా జగన్నాథంలకు అవకాశమిచ్చారు.

TTD new chairman Putta, Rayapati into board

తెలంగాణ నుంచి ఇద్దరికి, కర్నాటక, మహారాష్ట్రల నుంచి ఒక్కొక్కరికి చోటు కల్పించారు. తెలంగాణ నుంచి సండ్ర వెంకట వీరయ్య, ఇనుగాల పెద్దిరెడ్డికి చోటు దక్కింది. కర్నాటక నుంచి సుధా నారాయణమూర్తి, మహారాష్ట్ర నుంచి స్వప్నకు చోటు దక్కింది.

టీడీడీ బోర్డులో సీనియర్లకు పెద్ద పీట వేశారు. చాలాకాలంగా చైర్మన్ పదవి ఆశిస్తున్న రాయపాటికి సభ్యుడిగా అవకాశం ఇచ్చారు. జిల్లాల రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని బోర్డు కూర్పు జరిగింది. జిల్లాల రాజకీయ సమీకఱణలలో భాగంగానే శివాజీ, బోండా ఉమ, అనిత, పార్థసారథిలకు అవకాశం దక్కింది.

కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన రుద్రరాజు పద్మరాజుకు పదవి దక్కింది. సండ్ర వెంకట వీరయ్యకు మరోసారి అవకాశం ఇచ్చారు. సీనియర్ నేత ఇనుగాల పెద్దిరెడ్డికి అవకాశం వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+