తిరుమల ఘాట్ రోడ్లలో ప్రమాదాల నివారణకు మహాశాంతి హోమం, భక్తుల క్షేమం కోసం !
తిరుమల/తిరుపతి: ఇటీవల తిరుమల ఘాట్‌రోడ్లలో వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో తిరుమలకు ప్రయాణిస్తున్న భక్తులు ఆందోళనకు గురౌతున్నారు. తిరుమల ఘాట్ రోడ్లలో ప్రమాదాలు నివారించడానికి శ్రీవారి ఆశీస్సులు కోరుతూ వైఖానస ఆగమంలో పేర్కొనబడిన ఈ విశిష్ట మహా శాంతి హోమం నిర్వహించారు. శ్రీవారు భక్తులు తిరుమల ఘాట్ రోడ్లలో క్షేమంగా ప్రయాణం చెయ్యాలని మేము కోరుకుంటున్నామని టీటీడీ తెలిపింది
ఇటీవల డౌన్‌ఘాట్ రోడ్డులోని ఏడో మైలు శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద జరిగిన మహా శాంతి హోమంలో టీటీడీ ఈవో ఏవీ. ధర్మారెడ్డి కూడా పాల్గొన్నారు. ఘాట్‌రోడ్లలో వరుస ప్రమాదాల్లో ఏపీఎస్ఆర్టీసీ బస్సు బోల్తా, మరికొన్ని ప్రమాదాలు జరిగాయని, ఇక ముందు అలా జరగకుండా శ్రీవారి ఆశీస్సులు పొందాలని మహా శాంతి హోమం నిర్వహించామని టీటీడీ ఈవో ఏవీ. ధర్మారెడ్డి చెప్పారు.

శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇటీవల జరిగిన ప్రమాదాల్లో భక్తులకు పెద్దగా గాయాలు లేకుండా బయటపడినట్లు టీటీడీ ఈవో ఏవీ. ధర్మారెడ్డి తెలిపారు. ఈ ఘటనల అనంతరం ఘాట్ రోడ్డు ప్రమాదాలను ఎలా అధిగమించాలనే అంశంపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆర్టీసీ ఆర్ఎంలతో సమావేశం నిర్వహించి చర్చించామని, ఇక ముందు ప్రమాదాలు అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో ఏవీ. ధర్మారెడ్డి అన్నారు.
భక్తుల భద్రత కోసం శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ ఆంజనేయ స్వామివారి అనుగ్రహం కోరుతూ హోమం నిర్వహించాలని టీటీడీ ఆగమ సలహాదారులు సూచించారు. ఆగమ సలహాదారుల సూచనలతో డౌన్ ఘాట్ రోడ్డులోని శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి విగ్రహం దగ్గర మహా శాంతి హోమం నిర్వహించారు. భవిష్యత్తులో ఘాట్ రోడ్లలో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఉండేందుకు శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి సన్నిధిలో మహా శాంతి హోమం నిర్వహించామని టీటీడీ అధికారులు అంటున్నారు.

ఆగమ సలహాదారు మోహన రంగాచార్యులు, తిరుమల ఆలయ ప్రధాన అర్చకులలో ఒకరైన వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ ఆపదలు, భయాందోళనలు, అంటువ్యాధులు మొదలైన అశుభాలు కలిగినప్పుడు వైఖానస భగవత్ శాస్త్రంలో మహా శాంతి హోమం నిర్వహించడం గురించి పేర్కొన్నట్లు వివరించారు. ఈ హోమం నిర్వహించడం ద్వారా ఎటువంటి ఆపదలు కలుగకుండా నివారణ చేయవచ్చని వివరించారు. విష్వక్సేన ఆరాధన, పుణ్యహవచనం, పంచగవ్యారాధన, రక్షాబంధనం, అగ్నిప్రతిష్ట, విశేష హోమంలతో మహా శాంతి హోమం ప్రారంభమై మహా పూర్ణాహుతితో ముగిసింది.
మహా శాంతి హోమం నిర్వహించిన టీటీడీ అధికారులు గురువారం, శుక్రవారం రెండు ఘాట్ రోడ్లలో ప్రత్యేక వాహనాల్లో సంచరిస్తూ ఏపీఎస్ ఆర్ టీసీ బస్సులు ఎలా నడుపుతున్నారు, ఇతర ప్రైవేట్ వాహనాల డ్రైవర్లు వాహనాలు ఎలా నడుపుతున్నారు అంటూ పరిశీలిస్తున్నారు. ఆర్ టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న శ్రీవారి భక్తుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. డ్రైవర్లు బస్సులను సక్రమంగా నడుపుతున్నారా ?, డ్రైవర్లు ఎవరైనా బస్సులను వేగంగా నడుపుతున్నారా ? అంటూ టీటీడీ అధికారులు రహస్యంగా ఆరా తీస్తున్నారు.
-
నేటి నుంచి ఒంటమిట్ట రాములోరి ఆలయంలో.. !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications