తిరుమలలో అన్నదానం చేయాలని ఉందా, సామాన్య భక్తులకు టీటీడీ బిగ్ ఆఫర్..!!
Tirumala: తిరుమలలో శ్రీవారి భక్తుల కోసం టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే దర్శనంతో పాటుగా వసతి విషయంలోనూ సంస్కరణలు తీసుకొస్తున్నారు. సాంకేతికత వినియోగంతో క్యూ లైన్ మేనేజ్ మెంట్ సిస్టమ్ తో త్వరగా దర్శనం అందించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇక.. ఇప్పుడు సామాన్య భక్తులకు శ్రీవారి అన్నప్రసాద వితరణ చేసేందుకు అవకాశం కల్పించాలని టీటీడీ భావిస్తోంది. ఈ మేరకు కీలక ప్రతిపాదనలు సిద్దం అయ్యాయి.
టీటీడీ పాలక మండలి ఈ నెల 28న సమావేశం కానుంది. ఈ భేటీ వేళ రెండు కీలక ప్రతిపాదనలు చర్చకు రానున్నాయి. శ్రీవారి భక్తుల కోసం ముడుపు పత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు సిద్దం చేసారు. తిరుమల శ్రీవారిని ప్రతీరోజూ వేల సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకుంటారు. స్వామివారి దర్శనం అనంతరం మొక్కులు చెల్లించుకుంటారు. వెంకన్నకు హుండీల ద్వారా కానుకలను సమర్పించుకుంటారు. కొందరు మొక్కు రూపంలో స్వామివారికి చిల్లర నాణేలు శ్రీవారి హుండీలలో వేస్తుంటారు. అయితే, ఇకపై నాణేలు బదులు సరికొత్తగా ముడుపు పత్రాల విధానం తీసుకురావాలని టీటీడీ నిర్ణయించింది. ఇందు కోసం తిరుపతితోపాటు తిరుమలలోని ముఖ్యమైన ప్రాంతాల్లో ముడుపు పత్రం కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. తద్వారా భక్తులు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, నెఫ్ట్ ద్వారా నగదును పంపితే అందుకు తగిన ముడుపు పత్రాలు అందిస్తారు.భారత

సామాన్యులకు అన్నదాన విరాళాల అవకాశం
ఈ పత్రాలను మొక్కు తీర్చుకునేందుకు భక్తులే నేరుగా హుండీలో వేయొచ్చు. దీంతో భక్తులకు భారీగా నాణేలను, నగదును తీసుకెళ్లడంలో ఉన్న ఇబ్బందులు తొలగుతాయి. ఈ ప్రతిపాదన పైన బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అదేవిధంగా మాతృశ్రీ తరిగొండ వెంగ మాంబ అన్నప్రసాద కేంద్రంలో రోజూ లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరిస్తుండగా.. ఈ యజ్ఞంలో దాతలు పెద్ద ఎత్తున పాలుపంచుకుంటున్నారు. ప్రస్తుతం ఒక్కరోజు మొత్తం అన్న ప్రసాద వితరణ, ఉదయం అల్పాహారం, రాత్రి భోజనానికి లక్షల్లో విరాళం ఉంటుంది. ఈ క్రమంలో సామాన్య భక్తులు అంతమొత్తంలో విరాళం ఇవ్వలేని పరిస్థితి కనిపిస్తోంది. ఇక నుంచి సామాన్య భక్తులకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో కొత్త ప్రతిపాదన చర్చకు వచ్చింది. పెద్ద మొత్తంలో విరాళం ఇవ్వలేని సామాన్య భక్తుల కోసం పదిమంది, వంద మంది భక్తులకు సరిపడా విరాళం ఇచ్చినా వారిపేరున అన్నదానం చేసే విధంగా అవకాశం కల్పించనున్నారు. ఈ విధానాన్ని తొందరలోనే అందుబాటులోకి తీసుకురావడంపై ఇవాళ జరిగే టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications