చివరి నెల తిరుమలలో శ్రీవారి భక్తుల కోసం

Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీలో మార్పు లేదు. తాకిడి కొనసాగుతోంది. భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. వేలాదిమంది శ్రీవారిని దర్శించుకుంటోన్నారు. బుధవారం నాడు 73,670 మంది స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 26,062 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.00 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఎనిమిది కంపార్టుమెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి ఎనిమిది నుంచి 10 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లల్లో ఉన్న వారికి శ్రీవారి సేవకులు మంచినీరు, పాలు, అల్పాహారాన్ని అందించారు.

TTD released the festivals in Deceember in Tirumala

కాగా- డిసెంబర్ నెలలో తిరుమలలో నిర్వహించే పర్వదినాలు, విశేష ఉత్సవాల జాబితాను టీటీడీ అధికారులు విడుదల చేశారు. ప్రతి నెలలో శ్రీవారికి నివేదించే కార్యక్రమాలు, పండగలు, వివిధ విశేష ఉత్సవాలకు సంబంధించిన జాబితాను సంబంధిత నెల ప్రారంభానికి ముందే విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోన్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా డిసెంబర్‌లో నిర్వహించే పండగల జాబితాను విడుదల చేశారు. 2వ తేదీన మంగళవారం చక్రతీర్థ ముక్కోటితో డిసెంబర్ నెల విశేష ఈ ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు టీటీడీ అధికారులు. శ్రీవారి ఆలయంలో 4వ తేదీన గురువారం కార్తీక పర్వ దిపోత్సవాన్ని నిర్వహిస్తారు. అదే రోజున తిరుమంగైయాళ్వార్ శాత్తుమొర ఉంటుంది. 5వ తేదీన శుక్రవారం తిరుప్పాణాళ్వార్ వర్ష తిరు నక్షత్రం కార్యక్రమం జరుగుతుంది.

16న మంగళవారం నాడు ధనుర్మాసం ఆరంభమౌతుంది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో తిరుప్పావైని వినిపిస్తారు. ఈ మాసంలో తిరుప్పావై పాశురాలను పఠిస్తారు. ధనుర్మాసం ముగిసేంత వరకూ ఈ పాశురాలు తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణనాన్ని రెట్టింపు చేస్తాయి. 19వ తేదీ శుక్రవారం తొందార్పప్పోడియాళ్వార్ వర్ష తిరు నక్షత్రం ఉత్సవం ఉంటుంది. అదే రోజున శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభమౌతాయి. డిసెంబర్ 29న సోమవారం శ్రీవారి ఆలయంలో చిన్న శాత్తుమొరను నిర్వహిస్తారు.

30వ తేదీ మంగళవారం నాడు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు మొదలయ్యేది ఆ రోజే. జనవరి 8వ తేదీ వరకు ఇవి కొనసాగుతాయి. అదే రోజున శ్రీమలయప్ప స్వామివారు.. దేవేరులతో కలిసి స్వర్ణ రథోత్సవం మీద ఊరేగుతారు. 31న బుధవారం నాడు వైకుంఠ ద్వాదశి ఉత్సవాలు, శ్రీవారి చక్రస్నానాన్ని నిర్వహిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+