TTD: దర్శన టికెట్ కౌంటర్ మార్పు - సుప్రభాత సేవ రద్దు..!!
Tirumala: ధనుర్మాసం ప్రారంభ వేళ టీటీడీ కీలక నిర్ణయాలు. శ్రీనివాసుని అత్యంత ప్రీతికరమైన ధనుర్మాసంలో ప్రత్యేక పూజా నివేదనలు నిర్వహిస్తారు. నిత్యం స్వామివారిని మేల్కొల్పే సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పావై పఠనం చేస్తారు. ఇదే సమయంలో వైకుంఠ ఏకాదశికి టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. తిరుపతి విమానాశ్రయంలోని శ్రీవాణి దర్శన టికెట్ కౌంటర్ మార్పు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
కౌంటర్ల మార్పు: దేశ విదేశాల నుండి తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే విమాన ప్రయాణికుల సౌకర్యార్థం తిరుపతి విమానాశ్రయంలో ప్రతి రోజు 100 ఆఫ్‌లైన్ శ్రీవాణి టికెట్లను టీటీడీ జారీ చేస్తోంది. అయితే విమానాశ్రయంలో శ్రీవాణి టికెట్ల జారీకి అనుమతి లేని కారణంగా డిసెంబరు 16వ తేదీ శనివారం నుండి విమానాశ్రయంకు బదులుగా తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో జారీ చేస్తారు.

ప్రతి రోజు 100 టికెట్లను బోర్డింగ్ పాస్ సమర్పించిన భక్తులకు యధావిధిగా శ్రీవాణి దర్శన ఆఫ్‌లైన్ టికెట్లను ఇవ్వడం జరుగుతుందని టీటీడీ వెల్లడించింది. భక్తులు విమానాశ్రయంలో శ్రీవాణి దర్శన టికెట్ కౌంటర్ మార్పును గమనించాలని టీటీడీ అధికారులు కోరారు.
తిరుప్పావైతో మేల్కొలుపు: తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 23 నుండి 2024 జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాన్ని పురస్కరించుకుని డిసెంబరు 19వ తేదీన మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా డిసెంబరు 19న బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ కారణంగా డిసెంబరు 18న సోమవారం సిఫారసు లేఖలు స్వీకరించరని టీటీడీ ప్రకటించింది.
రేపటి నుంచి ధనుర్మాసం ప్రారంభం కానుంది. దీంతో..రేపటి నుంచి జనవరి 14వతేది వరకు శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ రద్దు చేసారు. నెల రోజులు పాటు సుప్రభాతంకు బదులుగా తిరుప్పావైతో స్వామివారికి మేల్కోలుపు నిర్వహిస్తారు. ఇక, వైకుంఠ ఏకాదశికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
వైకుంఠ ద్వార దర్శనం: ఈ నెల 23వ తేది నుంచి శ్రీవారి ఆలయంలో పది రోజులు పాటు వైకుంఠ ద్వార దర్శనం నిర్వహించనున్నారు. 22వ తేదిన తిరుపతిలో ఆఫ్ లైన్ విధానంలో సర్వదర్శనం భక్తులుకు టోకేన్లు జారి చేయనున్నారు.
రోజుకి 42500 చోప్పున....పది రోజులుకు 4.25 లక్షల టోకేన్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఇప్పటికే ఆన్ లైన్ టికెట్ల విక్రయాలు పూర్తయ్యాయి. ఈ నెల 19న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా.. వీఐపి బ్రేక్ దర్శనాలు,అష్టదళపాదపద్మారాదన సేవలను టీటీడీ రద్దు చేసింది.












Click it and Unblock the Notifications