రాజధాని అమరావతిలో ఏర్పాట్లు పూర్తి..: 300 ఆర్టీసీ బస్సులు
Amaravati: అమరావతి శ్రీవారి ఆలయంలో నేడు అత్యంత వైభవంగా శ్రీనివాస కళ్యాణోత్సవం జరుగనుంది. దీనికి అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ సందర్భంగా 27,000 మంది ఆలయానికి వస్తారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేశారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సహా పలువురు మంత్రులు శ్రీనివాస కల్యాణోత్సవానికి హాజరయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ బోర్డు సభ్యులు, కార్యనిర్వహణాధికారి శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకన్న చౌదరి ఇదివరకే ఆహ్వానం పత్రికను అందజేశారు.
2018లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఆలయ నిర్మాణానికి వెంకటపాలెంలో 25 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. 2019లో శంకుస్థాపన చేశారు. ఆ తరువాత వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆలయాన్ని నిర్మించింది. 2022లో వైభవంగా ప్రారంభించింది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించింది.
శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకుంని.. టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు అమరావతిలోనే మకాం వేశారు. పలు దఫాలుగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులు శ్రీవారి కల్యాణాన్ని వీక్షించడానికి వీలుగా భారీ ఎల్ఈడీ స్కీన్లను ఏర్పాటు చేశారు.
మంచినీరు, మజ్జిగ, అన్న ప్రసాదాలు పంపిణీ చేయనున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో శ్రీవారి ధర్మ రథాలతో ప్రచారం చేయించారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భక్తి సంగీత, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దీన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

మంచినీరు, మజ్జిగ, అన్న ప్రసాదాలు పంపిణీ చేయనున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో శ్రీవారి ధర్మ రథాలతో ప్రచారం చేయించారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భక్తి సంగీత, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దీన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
కల్యాణోత్సవానికి భజన బృందాలు, శ్రీవారి సేవకులను ఆహ్వానించారు. వారి సేవలను వినియోగించుకుంటారు టీటీడీ అధికారులు. ట్రాఫిక్ అంతరాయం తలెత్తకుండా పార్కింగ్ స్థలాలను గుర్తించారు. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా వాహనాలను ఎక్కడ నిలపాలనే విషయాన్ని భక్తులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తారు.
జిల్లా, టీటీడీ అధికారులు ప్రత్యేకంగా జాయింట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. సీసీ కెమెరాలతో నిరంతరం భద్రతను పర్యవేక్షించనున్నారు. వివిధ ప్రాంతాల నుండి భక్తులు సులువుగా ఆలయానికి చేరుకోవడానికి ఏపీఎస్ఆర్టీసీ సైత రంగంలోకి దిగింది. అమరావతి గ్రామాల నుంచి వెంకటపాలం ఆలయానికి 300 బస్సులు నడిపిస్తోంది.
మరోవంక- తిరుమలలో హోలీ పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరిగింది. శుక్రవారం సాయంత్రం 7 నుండి రాత్రి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడవాహనారూఢుడై నాలుగు తిరుమాడ వీధుల్లో విహరించారు. భక్తులను కటాక్షించారు. టీటీడీ అర్చకులు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.












Click it and Unblock the Notifications