మహా కుంభమేళాకు వెళ్ళే భక్తులకు తిరుమల శ్రీవారి గురించి టీటీడీ సూపర్ న్యూస్!
2025 హిందూ క్యాలెండర్ ప్రకారం వచ్చే సంవత్సరం జనవరి 13వ తేదీ పౌర్ణమి తిధి నుండి ఫిబ్రవరి 26 మహాశివరాత్రి వరకు మహా కుంభమేళా జరగబోతుంది. అత్యంత పవిత్రమైన ఈ మహాకుంభమేళాలో పవిత్ర స్నానానికి ఎనలేని ప్రాధాన్యత ఉంది. ఈ శుభ సమయంలో గ్రహాలు నక్షత్రాలు సంగమం అంతా పవిత్ర జలంలో ఉంటుందని ఈ సమయంలో స్నానాలు చేసిన వారికి చంద్రుడు తదితర గ్రహాల అనుగ్రహం లభిస్తుందని చెబుతారు.
మహా కుంభమేళాకు ఏర్పాట్లు
అంతేకాదు మహాకుంభమేళాలో పవిత్ర స్నానం చేయడం వల్ల ఆరోగ్యవంతులుగా మారుతారని కూడా నమ్ముతారు. అయితే అటువంటి మహాకుంభమేళాకు దేశవ్యాప్తంగా ఇప్పటినుండే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహా కుంభమేళా నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.

మహా కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయ ఏర్పాటు
ఇక ఇదే సమయంలో ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరగనున్న మహాకుంభమేళాలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవచ్చని టిటిడి శుభవార్త చెప్పింది. టిటిడి ఆధ్వర్యంలో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేయడానికి అక్కడ విస్తృతమైన ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా టీటీడీ జేఈవో గౌతమి వెల్లడించారు. ఈ మేరకు శ్రీవారి నమూనా ఆలయ ఏర్పాటుకు సంబంధించి అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె పలు సూచనలు చేశారు.
మహా కుంభమేళాలోనూ తిరుమల స్వామివారి కైంకర్యాలు
మహా కుంభమేళాకు వచ్చిన భక్తులు స్వామివారిని ప్రశాంతంగా దర్శించుకునేలాగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
45 రోజుల పాటు సాగే మహా కుంభమేళాకు దాదాపు రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో నమూనా ఆలయం ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆమె తెలిపారు. తిరుమలలో ఏ విధంగా అయితే శ్రీవారి కల్యాణోత్సవాలు, చక్రస్నానం తదితర కైంకర్యాలు జరుపుతారో అదేవిధంగా అక్కడ కూడా స్వామివారి కైంకర్యాలు జరుగుతాయని పేర్కొన్నారు.
మహా కుంభమేళాలోనూ తిరుమల శ్రీవారి దర్శనం
హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు, కళాబృందాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇక టిటిడి స్వామి వారి ఆలయ నమూనాతో పాటు అక్కడ నిర్వహించే కార్యక్రమాలకు యూపీ పోలీస్ అధికారులతో మాట్లాడి భద్రత ఏర్పాట్లను చేస్తున్నట్టు తెలిపారు. టిటిడి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారులు యూపీ పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నట్టు జేఈవో గౌతమి పేర్కొన్నారు. మహా కుంభమేళాలో కూడా స్వామివారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు దర్శన భాగ్యం కల్పించనున్నట్టు టిటిడి అధికారులు శుభవార్త చెప్పారు.












Click it and Unblock the Notifications